తెస్పియన్ ఫిల్మ్స్‌తో కలిసి అగ్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం ‘బాలన్-ది బాయ్’. ‘మంజుమ్మెల్ బాయ్స్’ దర్శకుడు చిదంబరం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. చందు సలీమ్‌కుమార్ ముఖ్య పాత్ర పోషించారు. జూన్ 19న తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానున్నది. ఈ విషయాన్ని ఆదివారం ఓ ప్రకటన ద్వారా మేకర్స్ తెలిపారు.
ఈ నెల 14న ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రం ప్రదర్శితం కానున్నదని, గ్లోబల్ సినిమాకు వేదికైన కేన్స్ స్క్రీనింగ్‌కు ముందే సినిమా విడుదల తేదీని ప్రకటించడం ఆనందంగా ఉందని, మనసుల్ని హత్తుకునే భావోద్వేగాలు, నేటివిటీతో సాగే కథ,కథనాలతో దర్శకుడు చిదంబరం ఈ సినిమాను తెరకెక్కించారని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి రచన: జితూ మాధవన్, కెమెరా: షైజు ఖాలిద్, సంగీతం: సుషిన్ శ్యామ్, నిర్మాతలు: వెంకట్ కె.నారాయణ, శైలజా దేశాయ్ షెన్.