Balakrishna | రాజమౌళి తర్వాత ఇప్పటివరకు కెరీర్లో ఫ్లాప్ చూడని దర్శకుడు అనీల్ రావిపూడు. ఈయన ఇప్పటివరకు చేసిన సినిమాలు ఆ హీరోల కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచాయి. హాస్యాస్పద చిత్రాలకు కమర్షియల్ హంగులను జోడించి హిట్లు సాధించడం ఈయన ప్రత్యేకత. ప్రస్తుతం ఈయన దర్శకత్వం వహించిన చిత్రం ఎఫ్-3. వెంకటేష్, వరుణ్‌తేజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం 2019లో సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన ఎఫ్-2కు సీక్వెల్‌గా తెరకెక్కింది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం మే27న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్లను మొదలుపెట్టింది. ప్రమోషన్లలో భాగంగా అనిల్ రావిపూడి బాలకృష్ణ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘బాలకృష్ణ చేయబోయే సినిమా ఒక రేంజ్లో ఉంటుంది. కంప్లీట్ డిఫరెంట్ సినిమా అవుద్ది. ఒక ‘పోకిరి’,’ గబ్బర్‌సింగ్’, ‘అర్జున్‌రెడ్డి’ టైప్‌లో క్యారెక్టర్ ఓరియెండెడ్ మూవీ. ఈ చిత్రంలో బాలయ్య 45 సంవత్సరాల మధ్య వయస్సు పాత్రలో నటించనున్నాడు. ఫాదర్, డాటర్ ఎమోషన్‌తో ఈ సినిమా సాగుతుందని తెలిపాడు’. దాంతో నందమూరి అభిమానులు ఈ సారి బాలయ్య ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడంటూ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం బాలయ్య గోపిచంద్ మలినేనితో ఓ యాక్షన్ చిత్రాన్ని చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుంది.