నందమూరి బాలకృష్ణ (Balakrishna) గర్జనకు సమయం ఆసన్నమవుతోంది. అతి త్వరలోనే వీరసింహారెడ్డి (Veera Simha Reddy)గా తనలోని రాయలసీమ పౌరుషాన్ని చూపిస్తూ సిల్వర్ స్క్రీన్‌పై మరోసారి గర్జించేందుకు రెడీ అవుతున్నాడు. స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) డైరెక్ట్ చేస్తున్న వీరసింహారెడ్డి థియేటర్లలో సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తు్న్న స్టన్నింగ్ అప్డేట్ వచ్చింది. ట్రైలర్ లాంఛ్ టైం ఫిక్స్ చేసినట్టు ఓ వార్త ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. జనవరి 6న ఒంగోలులో ట్రైలర్ లాంఛ్ చేయనున్నట్టు టాలీవుడ్ సర్కిల్ సమాచారం. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న వీరసింహారెడ్డిచిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. వరలక్ష్మి శరత్‌కుమార్, హనీ రోజ్, చంద్రికా రవి, పీ రవిశంకర్, ధునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే వీరసింహారెడ్డి నుంచి విడుదలైన జై బాలయ్య మాస్ ఆంథెమ్, సుగుణ సుందరి, మా బావ మనోబావాలు సాంగ్స్ నెట్టింటిని షేక్ చేస్తున్నాయి.
వీరసింహారెడ్డి మేకింగ్ స్టిల్స్..
Making Stills from #VeeraSimhaReddy with the GOD OF MASSES 🔥
Here are the #FramesOfVeeraSimhaReddy 💥
Mass Jaathara in Theatres from JAN 12 💥
Natasimham #NandamuriBalakrishna @megopichand @shrutihaasan @varusarath5 @MusicThaman @RishiPunjabi5 @SonyMusicSouth pic.twitter.com/blb7QgpBYc
— Mythri Movie Makers (@MythriOfficial) December 26, 2022
వీరసింహారెడ్డి టీజర్..
జై బాలయ్య మాస్ ఆంథమ్ సాంగ్..
సుగుణ సుందరి లిరికల్ వీడియో సాంగ్..
మా బావ మనోభావాలు సాంగ్ ప్రోమో..