‘అన్‌స్టాపబుల్ సీజన్-2’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
Unstoppable Season-2 | ‘ఆహా’ వేదికగా ప్రారంభమైన 'అన్‌స్టాపబుల్' షోకు విశేష ఆదరణ వచ్చింది. ఈ క్రమంలో ‘అన్‌స్టాపబుల్’ రెండో సీజన్ స్టార్ట్ చేస్తున్నట్లు ఆహా సంస్థ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. రెంబో సీజన్‌ను ఇంకాస్త గ్రాండియర్‌గా రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది.
Unstoppable Season-2 Trailer | నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేసిన ‘అన్‌స్టాపబుల్’ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ షో ప్రకటించినప్పుడు బాలయ్య హోస్ట్ అనగానే చాలా మంది ఆశ్చర్యపోయారు. ఏంటీ బాలయ్య హోస్ట్‌గా చేస్తున్నాడా? నిజమేనా? అంటూ చాలా మంది అభిప్రాయపడ్డారు. టాక్ షోలకు రావడానికే ఆలోచించే బాలయ్య.. టాక్‌షోను ఎలా హోస్ట్ చేస్తున్నాడు అంటూ అనుకున్నారు. బాలయ్యకు కోపం ఎంతుందో.. ప్రేమ అంతకంటే ఎక్కువే ఉంటుంది. ఇండస్ట్రీలో చాలా మంది బాలయ్యది చిన్న పిల్లాడి మనస్థత్వం అంటుంటారు. కాగా ఈ షోతో బాలకృష్ణలోని మరో కోణాన్ని చూశాం. బాలయ్య ఎంత సరదా మనిషి అని ఈ షోతో చాలా మంది ప్రేక్షకులకు తెలిసింది.
‘ఆహా’ వేదికగా ప్రారంభమైన ఈ షోకు విశేష ఆదరణ వచ్చింది. ఈ క్రమంలో ‘అన్‌స్టాపబుల్’ రెండో సీజన్ స్టార్ట్ చేస్తున్నట్లు ఆహా సంస్థ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. రెంబో సీజన్‌ను ఇంకాస్త గ్రాండియర్‌గా రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. మరి కొద్ది రోజుల్లో సీజన్-2 ప్రారంభం కానుంది. ఇప్పటికే సెలబ్రెటీల లిస్ట్‌ను కూడా రెడీ చేసినట్లు తెలుస్తుంది. ఈ లిస్ట్‌లో పవన్ కళ్యాణ్, చిరంజీవి, ప్రభాస్, అనుష్క, త్రివిక్రమ్ వంటి పలువురు స్టార్లు రానున్నట్లు తెలుస్తుంది. కాగా ఇదిలా ఉంటే తాజాగా ఈ షో ట్రైలర్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. అన్‌స్టాపబుల్ సీజన్-2 ట్రైలర్‌ను అక్టోబర్ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో బాలయ్య కౌ బాయ్ గెటప్‌లో వెనక్కి తిరిగి ఉన్నాడు.
అన్‌స్టాపబుల్ సీజన్-1కు విపరీమైన రెస్పాన్స్ రావడంతో సీజన్-2 కోసం అల్లుఅరవింద్ బాగానే ఖర్చు పెడుతున్నాడట. ఇక ప్రస్తుతం బాలయ్య ‘NBK107’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాగా ఉండనుందట. ఇప్పటికే విడుదలైన బాలయ్య పోస్టర్లకు విశేష స్పందన వచ్చింది.
Read Also:
SS Rajamouli | ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్లో ఆర్ఆర్ఆర్..వీక్షించనున్న జక్కన్న
Ranveer Singh | దీపికా-రణ్వీర్ మధ్య అంతా ఓకేనా? ఇంతకీ రణ్వీర్ ఏమన్నాడంటే..
Mahesh babu | ‘పొన్నియన్ సెల్వన్-1’లో ఆ పాత్రను ముందుగా మహేష్‌బాబు చేశాడా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్‌లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

