Viruman Movie | ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న కార్తి ‘విరుమన్’ తెలుగు వెర్షన్.. ప్లాట్ఫార్మ్ ఏదంటే?
Viruman Movie On OTT | కథా బలమున్న సినిమాలను చేస్తూ అటు కోలీవుడ్‌లో ఇటు టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు కార్తి. ఇటీవలే ఈయన నటించిన 'విరుమన్' విడుదలై సంచలన విజయం సాధించింది. కార్తి కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా విరుమన్ మూవీ నిలిచింది.
Viruman Movie On OTT | కథా బలమున్న సినిమాలను చేస్తూ అటు కోలీవుడ్‌లో ఇటు టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు కార్తి. ఇటీవలే ఈయన నటించిన ‘విరుమన్’ విడుదలై సంచలన విజయం సాధించింది. కార్తి కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా విరుమన్ మూవీ నిలిచింది. ఈ చిత్రానికి ముత్తయ్య దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం కేవలం తమిళంలోనే విడుదలయింది. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి దాదాపు కార్తి నటించిన అన్ని సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా తెలుగులో విడుదల కాలేదు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రాన్ని ఓటీటీలో తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేశారు.
‘విరుమన్’ చిత్ర హక్కులను అమెజాన్ సంస్థ దక్కించుకుంది. కాగా ఈ సినిమా తమిళ వెర్షన్ సెప్టెంబర్ 11నుండి స్ట్రీమింగ్ అవగా.. తాజాగా అమెజాన్ తెలుగు వెర్షన్‌ను కూడా రిలీజ్ చేసింది. ఈ చిత్రానికి తెలుగులో పసలపూడి వీరబాబు పేరుతో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రంలో కార్తికు జోడీగా డైరెక్టర్ శంకర్ కుమార్తే అధితి శంకర్ హీరోయిన్గా నటించింది. 2డీ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్య, జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 60కోట్లకు పైగా వసూళ్ సాధించింది. ప్రస్తుతం కార్తి కీలకపాత్రలో నటించిన పొన్నియన్ సెల్వన్ రిసెంట్‌గా విడుదలై పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈయన నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

