ప్రేమ, ద్వేషం రెండూ తీవ్రమే..
గాయం కారణంగా కొన్నిరోజులు విశ్రాంతిలో ఉన్న అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ మళ్లీ షూటింగ్‌తో బిజీ అయ్యారు.
గాయం కారణంగా కొన్నిరోజులు విశ్రాంతిలో ఉన్న అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ మళ్లీ షూటింగ్‌తో బిజీ అయ్యారు. తన తాజా సినిమా ‘దాదా’ చిత్రీకరణ కాకినాడలో శరవేగంగా జరుగుతున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 24న సినిమాను విడుదల చేయాలనే దృఢ సంకల్పంతో దర్శకుడు మలినేని గోపీచంద్ ముందుకెళ్తున్నారు. ఇదిలావుంటే గత కొన్నేళ్లుగా పాత్రల ఎంపిక విషయంలో బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్‌కేసరి, డాకూ మహరాజ్.. ఇవన్నీ చూడ్డానికి మాస్ పాత్రలే అయినా.. వాటి సంఘర్షణలు, భావోద్వేగాలు వేరు. రాబోతున్న ‘దాదా’ పాత్ర వాటన్నింటికీ భిన్నంగా ఉంటుందని సమాచారం. ఇందులో బాలకృష్ణ ముంబై అండర్‌వరల్డ్ డాన్‌గా కనిపిస్తారనే వార్త ఇప్పటికే వెలుగు చూసింది. అయితే.. ఇందులో ఆయన డాన్ మాత్రమే కాదట. ఈ సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో ఆయన ఓ చారిత్రక నేపథ్యం ఉన్న వంశానికి వారసుడిగా, పేదల పాలిటి పెన్నిధిగా కనిపిస్తారట. తన ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుందో, ద్వేషం అంతకంటే తీవ్రంగా ఉంటుందట. అలాంటి వ్యక్తి ముంబై ఎందుకు వెళ్లాడు? అక్కడి చీకటిసామ్రాజ్యాన్ని ఎలా శాసించాడు? అనేది ఈ కథలో ఆకస్తికరమైన అంశమని తెలుస్తున్నది.
ప్రస్తుతం బాలకృష్ణకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త కూడా సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆ వివరాల్లోకెళ్తే.. తన స్థాయికి తగ్గట్టు పాత్ర రాసుకొస్తే ‘జైలర్ 3’లో చేయడానికి రెడీ అని దర్శకుడు నెల్సన్‌కి గతంలో బాలయ్య చెప్పారట. తాజాగా ‘జైలర్ 3’ కోసం బాలకృష్ణను నెల్సన్ కలిశారని, ‘జైలర్ 3’లో బాలయ్య క్యామియో దాదాపు ఖరారైందని ఫిల్మ్ వర్గాల సమాచారం. నిజానికి ‘జైలర్ 2’లోనే బాలకృష్ణ నటించాలి. అయితే.. పాత్ర పరిధి, ప్రాధాన్యత విషయంలో సంతృప్తి చెందని బాలయ్య.. ‘జైలర్ 2’ను సున్నితంగా తిరస్కరించారు. ఇప్పుడు ‘జైలర్ 2’ బ్లాక్‌బస్టర్ అయిన నేపథ్యంలో ‘జైలర్ 3లో బాలయ్య’ అనే అంశం మళ్లీ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

