Balakrishna-Gopichandh malineni Movie | నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలను ఓకే చేస్తూ షూటింగ్లను కూడా పూర్తి చేస్తున్నాడు. చాలా కాలం తర్వాత ‘అఖండ’తో తిరిగి ఫాంలోకి వచ్చిన బాలయ్య అదే జోరుతో తన తదుపరి సినిమాలపై కంటిన్యూ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే చిత్రం నుంచి విడుదలై బాలయ్య పోస్టర్లకు విశేష స్పందన వచ్చింది. ‘క్రాక్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గోపిచంద్, బాలయ్యతో సినిమా చేయడంతో ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈక్రమంలో లేటెస్ట్గా తాజాగా మరో బిగ్ అప్డేట్ను ప్రకటించారు.
తాజాగా చిత్రబృందం ‘సింహం వేటకు సిద్ధం’ అంటూ పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో బాలయ్య చేతులు వెనక్కి పెట్టుకుని ఉన్నాడు. మొహం కనిపించకుండా కేవలం చేతులను మాత్రమే చూపిస్తూ మేకర్స్ పోస్టర్ను విడుదల చేశారు. అయితే టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా పోస్టర్గాని వీడియో గాని విడుదల చేయనున్నారట. దీనిపై రెండ్రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మైత్రీ మూవీస్ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. బాలయ్య ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడట.
Simham veta ki sidham 🔥#NBK107 First Hunt Loading 💥💥
NATASIMHAM #NandamuriBalakrishna @shrutihaasan @megopichand @OfficialViji @varusarath5 @MusicThaman pic.twitter.com/RFB8KgtMAr
— Mythri Movie Makers (@MythriOfficial) June 7, 2022