NBK 109 | భగవంత్ కేసరి సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న నందమూరి బాలకృష్ణ (Balakrishna) తన నెక్ట్స్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు. ఈ స్టార్ హీరో ప్రస్తుతం బాబీ (Bobby) డైరెక్షన్లో NBK 109 సినిమా చేస్తున్నాడని తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.
ఈ మహాశివరాత్రికి మృదువైన, క్రూరమైన యాంగిల్‌ను చూసేందుకు రెడీగా ఉండండి.. ఎన్బీకే 109 గ్లింప్స్ వచ్చేస్తుంది.. అంటూ ఇంట్రెస్టింగ్ అప్డేట్ను షేర్ చేశాడు బాబీ. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని బీహెచ్ఈఎల్లో షురూ అయినట్టు ఇప్పటికే అప్డేట్ కూడా వచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ ప్రాజెక్టులో ఊర్వశి రౌటేలా పోలీసాఫీసర్‌గా కనిపించబోతుంది.
బాలయ్య చేతిలో గొడ్డలి పట్టుకొని జీపులో నుంచి దిగుతున్నట్టుగా ఉన్న స్టిల్ నెట్టింటిని షేక్ చేస్తోంది. బాబీ గూస్బంప్స్ తెప్పించే గ్లింప్స్ రెడీ చేసినట్టు తాజా స్టిల్ చెప్పకనే చెబుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ విలన్‌గా కనిపించబోతున్నట్టు సమాచారం.
Get ready to witness the COOLEST & CRUELLEST form of #NBK, this Maha Shivarathri! 🪓🔥#NBK109Glimpse ~ Unveiling Tomorrow! 🤘💥 #NBK109 #NandamuriBalakrishna @thedeol @Vamsi84 @KVijayKartik #SaiSoujanya @chakrif1 @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/bNkeQkzqah
— Bobby (@dirbobby) March 7, 2024