Balakrishna | నందమూరి బాలకృష్ణ తన ఆవేశంతో మరోసారి వార్తల్లో నిలిచాడు. తాజాగా ‘అఖండ 2’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్న బాలకృష్ణ అక్కడి అభిమానుల్లో ఒకరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సోమవారం సాయంత్రం బాలకృష్ణ విశాఖ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయిన సమయంలో, పెద్ద సంఖ్యలో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు గుమిగూడారు. అయితే అభిమానుల మధ్య నుంచి ముందుకు వెళ్తున్న క్రమంలో ఒక అభిమాని బాలకృష్ణకు దగ్గరగా వచ్చి ఆయన దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించారు. దీంతో అతడిని చూసిన బాలయ్య ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయారు. చుట్టూ ఉన్న సిబ్బందిని ఉద్దేశిస్తూ… వీడెందుకు వచ్చాడు? వెళ్లగొట్టండి ఇక్కడి నుంచి వెంటనే పంపించండి. అని గట్టిగా ఆదేశించారు. అంతేగాకుండా సాయంత్రం ఈవెంట్లో కూడా వీడు కనపడకూడదు అని తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
అభిమానిపై ఆవేశంతో రెచ్చిపోయిన హీరో నందమూరి బాలకృష్ణ
అఖండ 2 సినిమా ప్రమోషన్లో భాగంగా విశాఖ ఎయిర్పోర్ట్లో దిగిన హీరో బాలకృష్ణకు స్వాగతం పలికిన అభిమానులు
అందులో ఒక అభిమానిని వీడెందుకు వచ్చాడు, వెళ్ళగొట్టండి.. సాయంత్రం కూడా వీడు కనపడకూడదని రెచ్చిపోయిన బాలకృష్ణ pic.twitter.com/lQvF2bc20s
— Telugu Scribe (@TeluguScribe) November 18, 2025