Legend @ 8 Years | ‘లెజెండ్’ @ 8 ఇయర్స్..బాలకృష్ణ కెరీర్లో ఓ అద్భుతం
లెజెండ్ (Legend)..బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో సింహా లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వచ్చిన సినిమా ఇది. 2014 మార్చ్ 28న విడుదలైన ఈ చిత్రం నేటితో 8 ఏళ్లు పూర్తి చేసుకుంది.
అప్పటి వరకు బాలయ్య (Nandamuri Balakrishna) సినిమాలకు కనీసం రూ.20 కోట్లు వస్తేనే మహాద్భుతం. అలాంటిది ఓ సినిమా మాత్రం ఏకంగా 40 కోట్లు షేర్ వసూలు చేసింది..అదే లెజెండ్ (Legend). బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో సింహా లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వచ్చిన సినిమా ఇది. 2014 మార్చ్ 28న విడుదలైన ఈ చిత్రం నేటితో 8 ఏళ్లు పూర్తి చేసుకుంది. అప్పట్లో లెజెండ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. ఏకంగా 1000 రోజుల పాటు థియేటర్స్ లో దిగ్విజయంగా ఆడింది ఈ చిత్రం.
దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు (Jagapathi Babu) విలన్ గా నటించాడు. ఆయన కెరీర్ ను మార్చేసిన సినిమా ఇది. 2014 ఎన్నికలకు ముందు వచ్చిన ఈ చిత్రంలో పొలిటికల్ పంచులు కూడా బాగానే ఉన్నాయి. మొత్తానికి అప్పట్లో భారీ అంచనాల మధ్య వచ్చి మంచి విజయం సాధించింది లెజెండ్. ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ ఓ సారి పరిశీలిద్దాం..
ప్రాంతాల వారిగా కలెక్షన్స్ ..
నైజాం: 9.41 కోట్లు
సీడెడ్: 8.40 కోట్లు
ఉత్తరాంధ్ర: 3.68 కోట్లు
ఈస్ట్: 2.25 కోట్లు
వెస్ట్: 2.21 కోట్లు
గుంటూరు: 4.14 కోట్లు
కృష్ణా: 2.30 కోట్లు
నెల్లూరు: 1.70 కోట్లు
ఏపీ, తెలంగాణ క్లోజింగ్ కలెక్షన్స్: 34.09 కోట్లు
కర్ణాటక: 3.25 కోట్లు
ఓవర్సీస్: 1.55 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: 1.50 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 40.39 కోట్లు షేర్
Read Also : RRR Hindi collections | ఆర్ఆర్ఆర్ ఫస్ట్ వీకెండ్ హిందీ కలెక్షన్ల సంగతేంటి..!
లెజెండ్ సినిమాకు 8 ఏళ్ల కిందే 32 కోట్ల బిజినెస్ జరిగింది. సింహా సూపర్ హిట్ కావడంతో ఆ నమ్మకంతోనే బాలయ్య సినిమాల్లోనే హైయ్యస్ట్ బిజినెస్ చేసారు. మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం అదిరిపోయే ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగ్స్ అప్పట్లో సంచలనం. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నపుడు దీనికి వచ్చిన నంది అవార్డులపై కాంట్రవర్సీలు కూడా అయ్యాయి. బాలయ్య కెరీర్లో మొదటి 40 కోట్ల షేర్ అందుకున్న సినిమా ఇది. ఈ మధ్యే బోయపాటి, బాలయ్య కాంబినేషన్లో మూడో సినిమా వచ్చింది. అదే అఖండ.. అది ఏకంగా 80 కోట్ల షేర్ వసూలు చేసింది.
Read Also : RRR Telugu Subtitles | సినిమా అర్థం కావట్లేదు..సబ్ టైటిల్స్ కావాలి రాజమౌళిగారు..!
Read Also : Nazriya Fahadh | లీలా థామస్, వివేక్‌ను చాలా మిస్సవుతున్నా..నాని భామ ఎమోషనల్ పోస్ట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jio IPO | జియో ఐపీవోకు యమ క్రేజ్.. 5.57 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Husband Hug | భార్యను ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Fine Rice | సన్నధాన్యం తన్నకుపోతున్నరు.. పచ్చి ధాన్యాన్నే కొంటున్న పొరుగు రాష్ర్టాల బ్రోకర్లు
Drugs | పల్లెల్లోకి డ్రగ్స్ మహమ్మారి.. విచ్చలవిడిగా వినియోగిస్తున్న యువత.. ఓ బాలికకు పలుమార్లు మత్తు ఇంజెక్షన్లు ?!
Revanth Reddy | సన్నబియ్యం కిలో రూ.95.. ఎల్ నినో ఎఫెక్ట్‌తోనే ధరలు పెరుగుతున్నాయి: రేవంత్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | భార్యను ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

