అగ్ర హీరో బాలకృష్ణ ప్రస్తుతం తన 108వ చిత్రంలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకుడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్నది. ‘అఖండ’ వంటి భారీ విజయం తర్వాత రాబోతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాల్ని పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ గురించి సోషల్మీడియాలో పలు పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ చిత్రానికి ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్ను ఖరారు చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఐ డోంట్ కేర్’ అన్నది ట్యాగ్ లైన్ అని చెబుతున్నారు.
అయితే టైటిల్ విషయంలో చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నది. బాలీవుడ్ హీరో అర్జున్ రామ్పాల్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్తో పాటు తనదైన శైలి వినోదాత్మక అంశాలతో దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం.0