Balakrishna-Anil Ravipudi Movie | ఆరుపదుల వయసులోనూ వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ యువ హీరోలకు సవాళ్ విసురుతున్నాడు నందమూరి బాలకృష్ణ. ఎంతో కాలంగా హిట్టు కోసం ఎదురు చూస్తున్న బాలకృష్ణ.. గతేడాది ‘అఖండ’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. ద్విపాత్రాభినయంలో బాలయ్య నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా అఘోర పాత్రలో బాలకృష్ణ నటన వర్ణనాతీతం. ప్రస్తుతం బాలయ్య అదే జోష్లో ‘వీరసింహా రెడ్డి’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు, టీజర్ గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని నందమూరి అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.
ఈ సినిమా తర్వాత బాలకృష్ణ, అనీల్ రావిపూడితో మాస్ ఎంటర్టైనర్ చేయనున్నాడు. కెరీర్ బిగెనింగ్ నుండి కమెడీ కథలనే నమ్ముకుని హిట్లు కొడుతున్ అనీల్ రావిపూడి.. మొదటి సారిగా యాక్షన్ సినిమా చేస్తున్నాడు. అది కూడా మాస్కు కేరాఫ్ అడ్రస్ అయిన బాలకృష్ణతో. ఫాదర్-డాటర్ ఎమోషన్తో సాగే ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ బిగ్ అప్డేట్ నెట్టింట వైరల్గా మారింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 8న గ్రాండ్గా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
ఈ చిత్రంలో బాలకృష్ణ 45 సంవత్సరాలున్న తండ్రి పాత్రలో కనిపించనున్నాడు. బాలయ్య కూతురుగా ‘పెళ్లిసందD’ హీరోయిన్ శ్రీలీల నటిస్తుంది. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారిపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు.