రాజస్థాన్ వెళ్లనున్న బాలయ్య
1986లో వరుసగా ఆరు బ్లాక్బాస్టర్లు ఇచ్చి సిక్స్‌ర్ కొట్టారు బాలకృష్ణ. ఇది ఇప్పటికీ చరగని రికార్డు. వరుసగా ఆరు హిట్లు చాలామంది హీరోలకున్నా.. ఒకే ఏడాదిలో ఆరు హిట్లు మాత్రం నేటి హీరోల్లో బాలయ్యకు మాత్రమే సొంతం.
1986లో వరుసగా ఆరు బ్లాక్బాస్టర్లు ఇచ్చి సిక్స్‌ర్ కొట్టారు బాలకృష్ణ. ఇది ఇప్పటికీ చరగని రికార్డు. వరుసగా ఆరు హిట్లు చాలామంది హీరోలకున్నా.. ఒకే ఏడాదిలో ఆరు హిట్లు మాత్రం నేటి హీరోల్లో బాలయ్యకు మాత్రమే సొంతం. ఇప్పుడు వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్‌కేసరి.. మూడు బ్లాక్బాస్టర్లు.. బాలయ్య స్థాయి హీరోలెవ్వరికీ ఈ పదేళ్లల్లో ఈ రికార్డ్ లేదు. త్వరలో నాలుగో సినిమా రాబోతున్నది. ‘ఎన్బీకే 109’ వర్కింగ్ టైటిల్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి కె.ఎస్.రవీంద్ర(బాబి) దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎస్.నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
వరుసగా మూడు విజయాల తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా కావడం, మెగాహిట్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత బాబీ చేస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు బాబీ ఈ సినిమాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘ఈ సినిమా ఎలా ఉంటుంది? అంటూ అభిమానులు అడుగుతున్నారు. వాళ్లకు నేను చెప్పేది ఒక్కటే. ఈ సినిమా నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. ఇందులో కొత్త బాలయ్యను చూస్తారు. ఊటీలో ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేశాం. నెక్ట్స్ షెడ్యూల్ రాజస్తాన్‌లో చేయనున్నాం. మిగతా వివరాలు వచ్చే ఏడాదిలో చెప్తా’ అన్నారు దర్శకుడు బాబీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

