Venu Yellamma | సంక్రాంతి కానుకగా వేణు ‘ఎల్లమ్మ’ అప్డేట్.. సాయంత్రం 4:05కు గ్లింప్స్ రిలీజ్!
Balagam Venu | 'బలగం' సినిమాతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలతో పాటు, అద్భుతమైన విజయాన్ని అందుకున్న వేణు యెల్దండి తన తదుపరి ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి వివరాలను సంక్రాంతి కానుకగా వెల్లడించబోతున్నట్లు ఈ సందర్భంగా తెలిపాడు.
Balagam Venu | ‘బలగం’ చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు వేణు యెల్దండి తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా అప్డేట్ను పంచుకున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 15 సాయంత్రం 4:05 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపాడు. ఈ సినిమాకు ‘ఎల్లమ్మ’ అనే శక్తివంతమైన టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం.
తెలంగాణ మట్టి వాసన, సంస్కృతి నేపథ్యంలో ‘బలగం’ను అద్భుతంగా ఆవిష్కరించిన వేణు ఈసారి కూడా గ్రామీణ నేపథ్యంలోనే మరో వైవిధ్యమైన కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ నటించనున్నారని, ఇది ఆయనకు వెండితెరపై నటుడిగా మొదటి సినిమా కాబోతోందని సమాచారం. ఇక కథానాయికగా కీర్తి సురేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ గ్లింప్స్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌లో ఎవరెవరు అనేది తెలియాలంటే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.
MY NEXT 🙏#Balagam showed me the path of love…
Walking the same road to meet you all once again 🙂Jan 15th na kaluddam 🤗
Happy Sankranthi ❤️#SVC61#DilRaju #Sirish @srivenkateswaracreations pic.twitter.com/wOvOuHerke— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) January 13, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

