Comedian Venu About Jabardasth Show | వేణు ఎల్దండి.. ప్రస్తుతం ఇండస్ట్రీలో మార్మోగిపోతున్న పేరిది. కమెడియన్‌గా తెలుగు వారికి సుపరిచమైన వేణు, జబర్దస్త్‌తో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నాడు. వేణు వండర్స్ అనే టీమ్‌కు లీడర్‌గా వ్యవహరించి నవ్వులు పంచాడు. ఇక ఇటీవలే వేణు బలగం సినిమాతో దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ను, తెలంగాణ సంసృతిని తెరమీద ఆవిష్కరించిన తీరుకు వేణుకు ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. కాగా వేణుకు ఎంతో పాపులారిటీ తెచ్చిపెట్టిన జబర్దస్త్ నుంచి హఠాత్తుగా బయటకు రావడంపై ఎన్నో రకాల రూమర్స్ వచ్చాయి.
మల్లేమాలతో విభేదాల కారణంగానే బజర్దస్త్ నుంచి బయటకు వచ్చినట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఆ వార్తలపై వేణు స్పందించాడు. విభేదాల కారణంగా తను జబర్దస్థ్ నుంచి బయటకు వచ్చానన్న వార్తల్లో నిజం లేదని, కేవలం సినిమాపై ఇష్టంతోనే ఆ షోను వదిలేసానని చెప్పాడు. మొదటి నుంచి తన లక్ష్యం సినిమానే అని, ఫుల్ టైమ్ సినిమాల్లో రాణించాలనే కోరికతోనే ఆ షోను వీడానని చెప్పుకొచ్చాడు. తను ఉన్న టైమ్‌లో రేటింగ్ బాగాఉండేదని, ఆదాయం కూడా బాగానే వచ్చేదని కానీ, సినిమాల కోసం బయటకు వచ్చేయాల్సి వచ్చిందని వేణు చెప్పుకొచ్చాడు.
గతవారం విడుదలైన బలగం బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని విజయం సాధించింది. తొలిరోజుకు మంచి రెండోరోజు, రెండో రోజుకు మించి మూడో రోజు ఇలా రోజురోజుకు సినిమా కలెక్షన్లు పెరుగుతూనే వస్తున్నాయి. పైగా పోటీగా చెప్పుకోదగ్గ సినిమాలేవి లేకపోవడంతో బలగం సినిమాకు బాగా కలిసి వచ్చింది. ఇక వేణు తన తర్వాతి సినిమా కూడా దిల్‌రాజు నిర్మాణంలోనే తెరకెక్కనుంది. ఇక గీతాఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కూడా వేణుతో ఓ సినిమా చేయడానికి రెడీ అయినట్లు టాక్.