Priyadarshi | తనదైన కామెడీ టైమింగ్‌తో ఎంటర్టైన్ చేసే అతికొద్ది మంది యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు ప్రియదర్శి (Priyadarshi). ఫ్రెండ్స్ క్యారెక్టర్లలో ఎక్కువగా కనిపిస్తూ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంటాడు. ఈ టాలెంటెడ్ యాక్టర్ మల్లేశం సినిమాతో హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత బలగం సినిమాతో సూపర్ బ్రేక్ అందుకున్నాడు. ఓ వైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే.. మరోవైపు సోలో హీరోగా కూడా రాణిస్తున్నాడు. తాజాగా ప్రియదర్శి కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన వార్త ఒకటి ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది.
తాజా టాక్ ప్రకారం ప్రియదర్శి కోసం క్లాస్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ (Indraganti Mohana Krishna). ఓ కథను రెడీ చేశాడట. స్క్రిప్ట్ ప్రియదర్శిని కూడా ఇంప్రెస్ చేసినట్టు ఇన్సైడ్ టాక్. మిస్టర్ ప్రెగ్నెంట్ ఫేం రూపా కొడువయూర్ ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటించబోతుందని సమాచారం. ఈ చిత్రం షూటింగ్ 2024 మార్చి నుంచి మొదలు కానున్నట్టు తెలుస్తోండగా.. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవలే హాయ్ నాన్న సినిమాలో నాని స్నేహితుడి పాత్రలో మెరిశాడు ప్రియదర్శి. మరోవైపు పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్లో నటించిన మంగళవారం కీలక పాత్రలో నటించాడు.
యూనిక్ స్టోరీలతో ప్రేక్షకులను పలుకరించే ఇంద్రగంటి మోహన కృష్ణ మరి ప్రియదర్శిని ఎలా చూపించబోతున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ బాబుతో తెరకెక్కించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. దీంతో ఈ సారి ఎలాగైనా మంచి హిట్టు కొట్టాలని వెయిట్ చేస్తున్నాడీ డైరెక్టర్.
Indraganti Mohan Krishna
Indraganti Mohan Krishna
Indraganti Mohana Krishna