Bala Krishna | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం బాలయ్య ఎంత స్ట్రైట్ ఫార్వార్డ్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఏ విషయాన్ని అయిన కూడా చాలా ఓపెన్‌గా మాట్లాడతారు. బాలయ్య జీవితం తెరచిన పుస్తకం అని చెప్పవచ్చు. ఆయన తాగే డ్రింక్ కూడా అందరికి తెలుసు. అదే మ్యాన్షన్ హౌజ్. అమెరికా వెళ్లినా సరే తన వెంట మ్యాన్షన్ హౌస్ తీసుకుని వెళతారని చిన్న అల్లుడు భరత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం చూశాం. కొన్ని సినిమాల్లో మ్యాన్షన్ హౌస్ , బాలకృష్ణ మీద డైలాగులు వినిపించాయి కాని బాలయ్య తన నోటి వెంట చెప్పింది లేదు.
తాజాగా ‘వెల్ కమింగ్ సూన్ టు యువర్ ఫేవరెట్ హౌస్’ అంటూ మ్యాన్షన్ హౌస్ ఒక యాడ్ చేయగా, ఆ వీడియోలో ‘వన్స్ ఐ స్టెప్ ఇన్…’ (హిస్టరీ రిపీట్స్) అంటూ బాలకృష్ణ డైలాగ్ చెప్పారు. అయితే… బాలకృష్ణ చేసింది మ్యాన్షన్ హౌస్ డ్రింకింగ్ వాటర్ కోసం. బాలయ్య ఆహా తెలుగు ఓటీటీ కోసం ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోకి హోస్ట్‌గా ఉండగా, ఆ షోకి మ్యాన్షన్ హౌస్ అడ్వర్టైజింగ్ పార్ట్నర్. దాంతో బాలయ్య నోటి వెంట మ్యాన్షన్ హౌస్ అనే పదాన్ని కొన్ని సార్లు విన్నాం. ఇప్పుడు డైరెక్టుగా ఆ సంస్థకు ఆయన ప్రచారం చేస్తూ ఒక వాణిజ్య ప్రకటన చేయడం విశేషం.
వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న బాలయ్య ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో అఖండ2 చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న ఆ సినిమా గ్లింప్స్ లేదా టీజర్ విడుదల అయ్యే అవకాశం ఉంది. దాని కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత ‘వీరసింహా రెడ్డి’ వంటి హిట్ తీసిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు బాలయ్య. రజనీకాంత్ ‘జైలర్ 2’లో అతిథి పాత్రలో మెరవనున్నట్టు తెలుస్తుంది.. తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నట్టు వినికిడి.
Balayya Mansion House Drinking Water Teaser 🔥#NandamuriBalakrishna pic.twitter.com/wJwqoRRH16
— NBK Cult (@iam_NBKCult) May 15, 2025