Bala Krishna | గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘అఖండ 2’ విడుదలపై అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో విజయం సాధించిన ‘అఖండ’ కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా, తొలుత సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుందన్న అఫీషియల్ అనౌన్సమెంట్ వచ్చినా, తర్వాత రిలీజ్ వాయిదా పడింది.తాజాగా ఓ పబ్లిక్ ఈవెంట్లో పాల్గొన్న బాలకృష్ణ, ‘అఖండ 2’ రిలీజ్‌పై స్పందించారు. ఈ ఏడాది డిసెంబర్ మొదటి వారంలో సినిమా థియేటర్లలోకి వస్తుందని తెలిపారు. అయితే ఖచ్చితమైన విడుదల తేదీని మాత్రం వెల్లడించలేదు. ఫ్యాన్స్ అంచనాల ప్రకారం, డిసెంబర్ 5 శుక్రవారం కావడంతో అదే రోజు రిలీజ్ అయ్యే అవకాశముంది. కానీ సినిమా మేకర్స్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
ఇప్పటికే బాలకృష్ణ తన డబ్బింగ్ పార్ట్ పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్పీడ్‌లో సాగుతున్నాయి. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉండటంతో, సినిమాకు కావాల్సిన మాస్ విజువల్ ఎఫెక్ట్ డెలివర్ చేయాలంటే మరికొంత సమయం అవసరం కావడంతోనే రిలీజ్ వాయిదా వేశామని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాలో బాలయ్య సరసన సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. విలన్ పాత్రలో ఆది పినిశెట్టి కనిపించనున్నారు. మాస్, ఆధ్యాత్మికత, సామాజిక అంశాలు, యువతకి సందేశం ఇలా విభిన్న అంశాలను మిళితం చేస్తూ బోయపాటి శ్రీను ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందిస్తున్నట్లు సమాచారం. తమన్ సంగీతం, పవర్ఫుల్ డైలాగ్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు అభిమానులకు మాస్ ఫెస్టివల్‌ను తలపించేలా ఉంటాయని టాక్.
రిలీజ్‌కు ముందే ఈ సినిమా డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయని సమాచారం. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ‘జియో హాట్‌స్టార్’, రూ.85 కోట్లు చెల్లించి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకుంది. సింహ, లెజెండ్, అఖండ వంటి హిట్ చిత్రాల తర్వాత బాలయ్య – బోయపాటి కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో విశ్వాసం మరో లెవెల్‌కి చేరింది. ఇప్పుడు అదే జోడీ నుంచి వస్తున్న ‘అఖండ 2’ మరింత భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. ఈ సంక్రాంతికి కాని, డిసెంబర్ మొదటి వారం… కానీ థియేటర్లలో మాస్ హంగామా ఖాయం అంటున్నారు అభిమానులు.