Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్దిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో సినిమా హైప్ మరింత పెరిగింది. ముఖ్యంగా రామ్ చరణ్ నటన, మాస్ అవతార్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్లో ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లను చిత్ర బృందం ఇప్పటికే ప్రారంభించింది. ఇటీవల ముంబైలో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌తో ప్రమోషన్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో ఎనిమిది ప్రత్యేక ఈవెంట్లను నిర్వహించేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం అందరి దృష్టి హైదరాబాద్‌లో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై పడింది. జూన్ 2న ఈ భారీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఎవరు వస్తారనే విషయంపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.టాలీవుడ్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీనికి కూడా ఓ ఆసక్తికర కారణం వినిపిస్తోంది. పెద్ది చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇదే నిర్మాణ సంస్థలో బాలకృష్ణ హీరోగా, దర్శకుడు గోపీచంద్ మలినేనితో మరో చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఒకే నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న హీరోలు, మరో సినిమా ఈవెంట్లకు అతిథులుగా హాజరవడం టాలీవుడ్లో కనిపించే సంప్రదాయం.
అయితే ఈ విషయంపై నిర్మాత వెంకట సతీష్ ఇటీవల మీడియాతో మాట్లాడారు. “ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బాలయ్య గారిని అడగాలి. ఇప్పటివరకు ఫైనల్ కాలేదు” అంటూ స్పందించారు. దీంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.ఒకవేళ బాలకృష్ణ ఈ ఈవెంట్‌కు హాజరైతే, ఒకే వేదికపై రామ్ చరణ్ – బాలయ్య కనిపించడం అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మెగా, నందమూరి అభిమానులకు ఇది పండగలాంటి క్షణంగా మారొచ్చు.అయితే ప్రస్తుతం ఈ వార్తపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అప్పటివరకు ఈ ప్రచారం జరుగుతూనే ఉంటుంది.