Bala Krishna|నందమూరి బాలకృష్ణకి ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటించిన సినిమాలు ప్రేక్షకులకి మాంచి కిక్ ఇస్తుంటాయి. అయితే బాలయ్య నటించిన చిత్రాలలో ఆదిత్య 369 చిత్రం చాలా స్పెషల్ అనే చెప్పాలి. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం 1991లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని, బాలయ్య గతంలో పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు. అది కూడా 999 మ్యాక్స్ పేరుతో రానుందని అన్నారు. ఈ మూవీ కోసం కూడా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఆదిత్య 369 చిత్రం టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కి అప్పట్లో ప్రేక్షకులకి మంచి వనోదం పంచింది. ఇప్పటికీ ఈ చిత్రం టీవీలో వస్తే ప్రేక్షకులు అస్సలు మిస్ కారు. అయితే శ్రీదేవీ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని మూడు దశాబ్దాల తరువాత మరోసారి థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేశారు. 4K డిజిటలైజేషన్, 5.1 సౌండ్‌తో మరింత అధునాతనంగా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. అయితే బాలయ్య అభిమానుల ఉత్సాహం చూసి ఈ చిత్రాన్ని వారం రోజుల ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు.
ఏప్రిల్ 4న ఆదిత్య 369 చిత్రాన్ని భారీ ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో చాలా మంది హీరోల సినిమాలు రీరిలీజ్ అయి మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. ఇప్పుడు ఆదిత్య 369 చిత్రం రీరిలీజ్‌లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయం అని అంటున్నారు. ఇక ఈ మూవీలో శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణ కుమార్‌గా రెండు విభిన్న పాత్రల్లో నందమూరి బాలకృష్ణ అద్భుతంగా నటించి మెప్పించారు. ఈ చిత్రం తెలుగు చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పుడు ఈ చిత్రం టెక్నికల్ హంగులతో మరింత గొప్ప అనుభూతిని అందించేలా రీరిలీజ్‌కి సిద్ధమైంది ఆదిత్య 369. మరి అభిమానులు డేట్ గుర్తుంది కదా. ఏప్రిల్ 4న రిలీజ్ అయ్యే ఈ సినిమాని అస్సలు మిస్ కాకండి.