తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar)తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘జైలర్’ అనే టైటిల్‌ను ఫైనల్ చేయగా..ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్‌కు అదిరిపోయే స్పందన వచ్చింది. ఒక్క పోస్టర్‌తోనే మేకర్స్ సినిమాపై క్యూరియాసిటీతోపాటు అంచనాలను పెంచేశారు. ఈ మూవీలో అందాల తార ఐశ్వర్యరాయ్ హీరోయిన్గా నటించనుంది.
కాగా రజినీకాంత్ చిత్రంలో మరో అందాల తార మెరువబోతుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరనుకుంటున్నారా..? బాహుబలి, సైరా లాంటి పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో మెరిసిన మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah Bhatia). కీ రోల్ కోసం మేకర్స్ తమన్నాను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్ నడుస్తుండగా..దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో ఆగస్టు 15 నుంచి జైలర్ షూటింగ్ షురూ కానుంది.
అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నాడు. రమ్యకృష్ణ, శివరాజ్‌కుమార్, ప్రియాంక అరుళ్ మోహన్ కీ రోల్స్ పోషిస్తున్నారు. ఈ చిత్రాన్నిసన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. కొంత కాలం ఆగితే మరిన్ని వివరాలపై స్పష్టత రానుంది.
Read Also : Kajal Kattappa look | కట్టప్పగా మారిన కాజల్ అగర్వాల్..ట్రెండింగ్‌లో స్టిల్
Read Also : NBK 108 | బాలకృష్ణ ఫ్యాన్స్ గెట్ రెడీ..అనౌన్స్ మెంట్‌కు టైం ఫిక్స్..!
Read Also : Vishal | సినిమా షూటింగ్లో గాయపడ్డ హీరో విశాల్..!