Bachelor Movie | అఖిల్ పెళ్లి కష్టాలు

పెళ్లి సంబంధాల కోసం ఓ ప్రవాస భారతీయ యువకుడు ఇండియాకు వస్తాడు. మనసును దోచే అమ్మాయి కోసం అన్వేషణ ఆరంభిస్తాడు. నచ్చిన చిన్నది తనకు దొరకదేమో అనుకునే తరుణంలో ఓ ముద్దుగుమ్మ తారసపడుతుంది. అయితే తనకు పూర్తి భిన్నమైన వ్యక్తిత్వం కలిగిన ఈ అమ్మడితో బ్యాచ్‌లర్ బాబుకు చిక్కులొచ్చిపడతాయి. అవేవిటో..ఈ జంట ప్రేమాయణం ఎలా సాగిందో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు బొమ్మరిల్లు భాస్కర్. ఆయన దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్‌బ్యాచ్‌లర్’. బన్నీ వాసు, వాసువర్మ నిర్మాతలు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 8న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని నిర్మాతలు పేర్కొన్నారు. ఆమని, మురళీశర్మ, జయప్రకాష్, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రదీశ్ ఎమ్ వర్మ, సంగీతం: గోపీసుందర్, నిర్మాణ సంస్థ: జీఏ2పిక్చర్స్, సమర్పణ: అల్లు అరవింద్, దర్శకుడు: బొమ్మరిల్లు భాస్కర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Akhil
- bachelor
- Pooja hegde
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

