Baby | టాలీవుడ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand deverakonda), వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా వచ్చిన చిత్రం (Baby). హృదయ కాలేయం ఫేం సాయిరాజేశ్ (Sai Rajesh) దర్శకత్వం వహించాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విరాజ్ అశ్విన్ మరో లీడ్ రోల్ పోషించాడు. జులై 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తొలి రోజు నుంచి మంచి వసూళ్లు రాబడుతూ.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకు ఆరు రోజుల్లో రూ.43.8 కోట్లు రాబట్టినట్టు నిర్మాత ఎస్కేఎన్ తెలిపారు.
ఆరు రోజులు, వర్షాలు.. కానీ బేబి సినిమాపై మీ ప్రేమ, ఆప్యాయతలు అసమాన్యం. మీ ప్రేమకు కృతజ్ఞతలు.. అంటూ ఎస్కేఎన్ ట్వీట్ చేశారు. అతి త్వరలోనే బేబి రూ.50 కోట్ల గ్రాస్ మార్క్ చేరుకోవడం ఖాయమని చెబుతున్నారు ట్రేడ్ పండితులు. బ్రో విడుదలకు ముందే బేబి ఈ మార్క్‌ను చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు సినీ జనాలు.
ఆనంద్ దేవర కొండ, వైష్ణవి చైతన్య మధ్య చిన్న నాటి ప్రేమ, ఆ తర్వాత వైష్ణవి కాలేజ్ స్టడీస్ కోసం టౌన్‌కు రావడం, అక్కడ విరాజ్ అశ్విన్ పరిచయం కావడం.. ఆ తర్వాత ముగ్గురు మధ్య ఎలాంటి ట్రయాంగిల్ లవ్ ట్రాక్ నడిచింది. ఈ ట్రాక్‌కు ఎలా శుభం కార్డు పడిందనే నేపథ్యంలో సాగుతూ మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతోంది. బేబి చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్కేఎన్ నిర్మించారు. ఆనంద్ దేవరకొండ దీంతోపాటు గమ్ గమ్ గణేశా చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు.
6 days & rains but ur love and affection on #Babythemovie is UNSTOPPABLE 🙏🙏🙏
Gratitude ❤️❤️❤️ pic.twitter.com/rhZBKxyaPI— SKN (Sreenivasa Kumar) (@SKNonline) July 20, 2023
బేబి ట్రైలర్..
ప్రేమిస్తున్నా లిరికల్ వీడియో సాంగ్..
దేవరాజా లిరికల్ వీడియో సాంగ్..
ఓ రెండు మేఘాలిలా లిరికల్ వీడియో సాంగ్..
బేబి టీజర్.. వీడియో