మ్యాస్ట్రో నుండి ‘బేబీ ఓ బేబీ’ లిరికల్ వీడియో విడుదల

యంగ్ హీరో నితిన్ హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది నితిన్ చేసిన చెక్, రంగ్ దే చిత్రాలు డిజాస్టర్స్‌గా మిగిలాయి. ప్రస్తుతం మ్యాస్ట్రో అనే సినిమా చేస్తున్నాడు. హిందీలో అయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన సూపర్‌హిట్ సినిమా ‘అంధధూన్’ రీమేక్‌గా ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం మార్చి 30న నితిన్ పుట్టినరోజు సందర్భంగా అతనికి విషెస్ చెబుతూ.. చిత్ర యూనిట్ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంది.
తాజాగా ఈ సినిమా నుంచి ‘బేబీ ఓ బేబీ .. చిన్న నవ్వు చాలే’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకి శ్రీజో లిరిక్స్ రాయగా, అనురాగ్ కులకర్ణి పాడారు. ఈ పాటతో పాటు విజువల్స్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్గా నబా నటేష్.. మరో కీలక పాత్రలో హీరోయిన్ తమన్నా భాటియా నటిస్తున్నారు. ఎన్.సుధాకర్ రెడ్డి మరియు నిఖితా రెడ్డిలు చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాదే ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నహాలు చేస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Maestro
- Merlapaka Gandh
- Nithin
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

