Baby Movie Collections | వీక్ డేస్‌లో హాల్స్ నిండుగా కనిపిస్తున్నాయినే మాట విని చాలా రోజులైంది. ఇక వారం తర్వాత ఓ సినిమాకు థియేటర్ల ముందు హౌజ్ ఫుల్ బోర్డులు చూసి నెలలు దాటింది. ప్రస్తుతం ఈ గణాంకాలను బేబీ సినిమా క్రియేట్ చేస్తుంది. పట్టుమని పదికోట్ల బడ్జెట్ కూడా లేని బేబీ సినిమా థియేటర్లను కమ్మేస్తుంది. ఓ వైపు భీభత్సమైన వర్షాలు పడతున్నా.. మరోవైపు ప్రేక్షకులు గొడుగులా బేబీ థియేటర్లను ఎంచుకుంటున్నారు. సినిమా వచ్చి వారం దాటినా ఇంకా అదే మత్తులో కుర్రకారు, ఆటో మాస్ జనాలు ఊగిపోతున్నారు. కల్ట్ బొమ్మ అంటూ రిపీటెడ్ షోలు వేసేస్తున్నారు. రోజు రోజుకు ఈ సినిమాపై క్రేజ్ పెరుగుతూనే ఉంది. టిక్కెట్లు సైతం భారీ సంఖ్యలో తెగుతూనే ఉన్నాయి.
అసలు స్టార్ కాస్ట్ లేదు. పెద్ద డైరెక్టర్, పెద్ద ప్రొడక్షన్ సంస్థ అంత కన్నా కాదు. కేవలం కంటెంట్‌ను నమ్ముకుని సినిమా తీశారు. ఇప్పుడా నమ్మకమే కోట్లు కుమ్మరిస్తుంది. హిట్ నుంచి డబుల్, ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్టు దిశగా బేబి సినిమా పరుగులు పెడుతుంది. తాజాగా ఈ మూవీ రూ.50 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కేవలం 8 రోజుల్లోనే ఈ ఫీట్‌ను అందుకుందంటే మాములు విషయం కాదు. ఈ మధ్య కొన్ని పెద్ద సినిమాలు సైతం ఈ నెంబర్‌ను అందుకోవడానికి తెగ కష్టపడుతుంటే.. బేబీ సినిమా మాత్రం చాలా ఈజ్‌తో టచ్ చేసింది. ఇక ఈ వారం రిలీజైన సినిమాలేవి పాజిటీవ్ రివ్యూలు తెచ్చుకోలేదు. దాంతో సినీ లవర్స్‌కు బేబీ తప్ప మరో ఆప్షన్ కనిపించడం లేదు. ఇక శని, ఆదివారాల్లో కూడా ఈ సినిమా బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయి.
వచ్చే వారం రిలీజయ్యే బ్రో వరకు ఈ సినిమాకు పోటీ లేదు. ఈ లెక్కన ఫైనల్ రన్లో మరో పాతికకోట్లు వెనకేసుకున్ ఆశ్యర్యపోనక్కర్లేదు. ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే భారీ లాభాల్లోకి వచ్చేశారు. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధానపాత్రల్లో నటించారు. ముఖ్యంగా విజయ్ బుల్గానిన్ మ్యూజిక్కు చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్కేఎన్ ఈ సినిమాను నిర్మించాడు.
#BabyTheMovie Becomes the 𝐅𝐀𝐒𝐓𝐄𝐒𝐓 𝟓𝟒 𝐂𝐑 grossed movie in just 8 days 🔥🙏
(ᴍᴇᴅɪᴜᴍ ʀᴀɴɢᴇ ᴍᴏᴠɪᴇꜱ)#Baby is All set to have a BLOCKBUSTER 2nd Weekend on cards 💥Experience the #CultBlockbusterBaby in cinemas near you now! ❤️🔥
🎟️ : https://t.co/sWNsCMBr3y pic.twitter.com/ojXAwOB12X
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) July 22, 2023