Baahubali | సోషల్ మీడియాలో ఓ అద్భుతమైన ఫ్యాన్ ఎడిట్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ‘బాహుబలి’ సినిమాలో మహేంద్ర బాహుబలికి ఓ స్నేహితుడు ఉంటే ఎలా ఉంటుందో ఊహిస్తూ ఓ నెటిజన్ ఫన్నీ వీడియో క్రియేట్ చేశాడు. అందులో ప్రభాస్‌కు స్నేహితుడిగా మంచు విష్ణు ‘కన్నప్ప’ లుక్‌లో కనిపించడంతో వీడియోకు భారీ స్పందన లభిస్తోంది. ప్రస్తుతం “బాహుబలి-కన్నప్ప ఫ్రెండ్స్ వెర్షన్” అనే ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.రాజమౌళి తెరకెక్కించిన ఈ ఎపిక్ యాక్షన్ డ్రామాలో ప్రేమ, పగ, ప్రతీకారం, త్యాగం అన్నీ ఉన్నా… స్నేహం కోణం మాత్రం కనిపించలేదు. ఆ లోటును పూరించడానికి ఈ క్రియేటివ్ నెటిజన్ ముందుకొచ్చాడు. తన ఎడిటింగ్ నైపుణ్యాన్ని చూపిస్తూ మహేంద్ర బాహుబలికి ఫ్రెండ్‌గా ‘కన్నప్ప’ను జత చేశాడు.
వీడియోలో బాహుబలి శివలింగాన్ని ఎత్తుకెళ్లే సీన్లో నుంచి యుద్ధ సన్నివేశాల వరకు కన్నప్ప అండగా నిలిచేలా చూపించారు. ప్రేమలో, యుద్ధంలో, భల్లాలదేవుతో పోరాటంలో కూడా ఇద్దరూ కలిసి కనిపించడం ఫన్నీగా, ఆసక్తికరంగా ఉంది. కొన్ని చోట్ల కన్నప్ప బాహుబలికంటే ముందుగా యుద్ధానికి దిగడం, సరదా డైలాగ్‌లతో హాస్యం పండించడం నెటిజన్లను నవ్విస్తోంది. మంచు విష్ణు స్వీయ నిర్మాణంలో వచ్చిన ‘కన్నప్ప’ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోకపోయినా, ప్రభాస్ అందులో అతిథి పాత్రలో రుద్రగా నటించి అభిమానులను ఆకట్టుకున్నారు. అదే ఇద్దరినీ ఇప్పుడు ఒకే ఫ్రేమ్‌లో చూడటంతో ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు “ఏం తాగి ఎడిట్ చేశావ్ బ్రో!”, “నీకు గుడి కట్టాలి”, “ఇది నిజంగా క్రియేటివ్ మాస్టర్‌పీస్!” అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్)లో విపరీతంగా షేర్ అవుతోంది. ఇలా అభిమానులు ఊహాశక్తిని వినోదంగా మార్చిన విధానం సినీ ప్రియులను అలరిస్తోంది. ఇక బాహుబలి రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాగా, రీసెంట్గా రెండు భాగాలని ఒకే పార్ట్‌గా బాహుబలి ది ఎపిక్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
“If Kannappa & Baahubali were Friends”#Kannappa #BaahubaliTheEpic #Prabhas #SSRajamouli @BaahubaliMovie @iVishnuManchu @ssrajamouli @tamannaahspeaks pic.twitter.com/8tqSfHiV6F
— Charan Crossovers (@CharanCrossover) November 5, 2025