నిర్మాతగా, పీఆర్వోగా టాలీవుడ్ సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు చేసిన బీఏ రాజు శుక్రవారం రాత్రి గుండె పోటుతో కన్నుమూసారు.ఆయన మరణం చాలా మంది అభిమానులకు షాకింగ్‌గా మారింది. బీఏ రాజు సినిమాలకు పీఆర్వోగా ఉండడమే కాక సూపర్ హిట్ అనే సినీ పత్రికను నడుపుతూ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా సినీ పరిశ్రమకు సంబంధించిన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అందిస్తుంటారు.
సినీ పరిశ్రమకు సంబంధించిన సంగతులు తెలుసుకోవాలంటే బీఏ రాజు ట్విట్టర్ అకౌంట్ ఫాలో అయితే సరిపోతుంది. అంతలా ఆయన అప్డేట్స్ కొనసాగుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఆయన ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య రీసెంట్గా 6 లక్షలకు చేరింది. ఈ క్రమంలో చాలా మంది సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. బీఏ రాజు కూడా ప్రతి ఒక్కరికి ట్వీట్‌కు స్పందిస్తూ వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఏదేమైన సినీ పరిశ్రమలో చాలా మంచి వ్యక్తిగా ఉన్న బీఏ రాజు ఇలా అకాల మరణం చెందడంతో ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
6,00,000.. 6 LAKHS FOLLOWERS !!!
— BA Raju's Team (@baraju_SuperHit) May 13, 2021
A Big Thanks To One & All For Your Constant Support 🙏 #StaySafe #WearAMask pic.twitter.com/TVocMKxEvR