Dream Girl-2 Movie | కొన్ని గంటల ముందు రిలీజైన డ్రీమ్ గర్ల్ ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఆయుష్మాన్ ఖురానా లేడీ గెటప్ల్ చేసిన వీర లెవల్ యాక్టింగ్‌కు అందరూ ఫిదా అయిపోతున్నారు. ట్రైలర్లోనే ఈ రేంజ్లో ఉంటే సినిమాలో ఇంకా ఆయుష్మాన్ లేడీ గెటప్‌లో ఏ రేంజ్లో ఎంటర్టైన్ చేస్తాడో అని అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. నాలుగేళ్ల కిందట సంచలనాలు సృష్టించిన డ్రీమ్ గర్ల్ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కింది. తొలిపార్టుకు దర్శకత్వం వహించిన రాజ్ శండియాలానే సెకండ్ పార్ట్‌ను కూడా తెరకెక్కించాడు. ఈ సినిమా ఆగస్టు 25న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.
తాజాగా ఈ సినిమాపై ఆయుష్మాన్ ఖురానా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో తన నటనకు ఉత్తమ నటిగా ప్రశంసలు పొందుతానని ఆయుష్మాన్ సరదాగా చెప్పాడు. అయితే మహిళగా నటించడం మాత్ర అంత సులభం కాదని, చాలా కష్టమని తెలిపాడు. పూజా పాత్ర కోసం శరీరం సహకరించడానికి చాలా బరువు తగ్గానని వెల్లడించాడు. కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయుష్మాన్‌కు జోడీగా అనన్య పాండే హీరోయిన్గా నటిస్తుంది. బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఏక్తాకపూర్, శోభా కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.