Ayalaan | ఇటీవలే మావీరన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan). ఈ హీరో నటిస్తోన్న సినిమాల్లో ఒకటి అయలాన్ (Ayalaan). సైన్స్ ఫిక్షన్ జోనర్లో వస్తున్న ఈ చిత్రానికి ఆర్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన అయలాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. శివకార్తికేయన్ గగనంలో విహరిస్తుండగా.. అతడితోపాటే ఏలియన్ కూడా వెళ్తున్న పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
అయలాన్ భూమిపై ల్యాండింగ్ అయ్యే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అక్టోబర్ రెండో వారానికల్లా సీజీ వర్క్స్ పూర్తి కానున్నాయి. ఈ సారి ఓవర్సీస్ మార్కెట్‌ను షేక్ చేసే దిశగా అయలాన్ ఉండబోతుందన్న అప్డేట్ ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయలాన్ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అయలాన్‌లో శరద్ కేల్కర్, ఇషా కొప్పికర్, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్, బాల శరవణన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
శివకార్తికేయన్ మరోవైపు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. SK21గా వస్తున్న ఈ మూవీ షూటింగ్ కశ్మీర్లో కొనసాగుతోంది. సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే కశ్మీర్ లొకేషన్లో సాయిపల్లవికి సంబంధించిన స్టిల్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ చిత్రంలో విశ్వరూపం ఫేం రాహుల్ బోస్ (RahulBose) విలన్‌గా నటిస్తున్నాడు.
Get ready for the visitor from Outer space 👽#Ayalaan is coming to you all this Diwali#AyalaanFromDiwali2023@Siva_Kartikeyan @arrahman @Ravikumar_Dir @kjr_studios @24amstudios @ishakonnects @SharadK7 @iYogiBabu #Karunakaran #Niravshah @AntonyLRuben @muthurajthangvl… pic.twitter.com/YxJ7LdSVTy
— Rakul Singh (@Rakulpreet) April 24, 2023