Avatar 3 Ott | అవతార్ 3 ఓటీటీ ఎంట్రీ.. నేటి నుండి రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్, ఫ్రీ రిలీజ్ ఎప్పుడంటే?
Avatar 3 Ott | ప్రపంచ సినీ చరిత్రలో విజువల్ వండర్‌గా నిలిచిన ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో సందడి చేయడానికి సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన తర్వాత ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది.
Avatar 3 Ott | ప్రపంచ సినీ చరిత్రలో విజువల్ వండర్‌గా నిలిచిన ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో సందడి చేయడానికి సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన తర్వాత ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. ఈ సినిమా మార్చి 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇది సాధారణ సబ్‌స్క్రిప్షన్‌లో కాకుండా, PVOD (ప్రీమియం వీడియో ఆన్ డిమాండ్) విధానంలో అందుబాటులోకి వచ్చింది. అంటే ప్రేక్షకులు ప్రత్యేకంగా డబ్బులు చెల్లించి ఈ సినిమాను రెంట్ లేదా పర్చేజ్ చేసుకుని చూడాలి.
అదే విధంగా ఆపిల్ టీవీ ప్లాట్ఫామ్లో కూడా ఇదే విధానంలో సినిమా అందుబాటులో ఉంది.సబ్స్క్రిప్షన్ ఉన్నవారికి ఉచితంగా ఈ సినిమా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్నది ఫ్యాన్స్‌లో ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది. సమాచారం ప్రకారం, గ్లోబల్‌గా ఈ చిత్రం డిస్నీ+లో స్ట్రీమింగ్ కానుంది. భారతదేశంలో మాత్రం జియోహాట్‌స్టార్ వేదికగా విడుదలయ్యే అవకాశం ఉంది. సాధారణంగా డిజిటల్ రెంట్ ప్రారంభమైన 4 నుంచి 8 వారాల తర్వాతే మెయిన్ స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది. ఈ లెక్కన చూస్తే, ఏప్రిల్ చివరి వారంలో లేదా మే 2026 తొలి వారంలో ఈ సినిమా ఫ్రీ స్ట్రీమింగ్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు $1.48 బిలియన్ (దాదాపు రూ.13,964 కోట్లు) వసూళ్లు సాధించి టాప్ గ్రాసర్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. ఇటీవల జరిగిన ఆస్కార్ అవార్డ్స్‌లో “బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్” విభాగంలో అవార్డు గెలుచుకోవడం ఈ చిత్ర సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం.
మూడో భాగంలో పండోరా గ్రహంలోని కొత్త కోణాన్ని దర్శకుడు ఆవిష్కరించారు. జేక్ సల్లీ, నేతిరి కుటుంబం ఈసారి అగ్నిపర్వత ప్రాంతాల్లో నివసించే ‘యాష్ పీపుల్’ అనే కొత్త తెగను ఎదుర్కొంటుంది. ఈ తెగ స్వభావం చాలా అగ్రెసివ్‌గా ఉండటం కథకు మరింత ఉత్కంఠను తీసుకొస్తుంది. ‘వరాంగ్’ అనే పాత్ర ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. థియేటర్లలో విజువల్ ట్రీట్ అందించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. ఫ్రీ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు త్వరలోనే గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

