Ritika Nayak | ఒక్క సినిమాతోనే పాపులర్..గీతాఆర్ట్స్‌లో మూడు సినిమాల డీల్..!
ఒక్క ఛాన్స్..ఒకే ఒక్క ఛాన్స్..ఈ ఢిల్లీ బ్యూటీకి ఆ ఒక్క ఛాన్స్ వచ్చేసింది. ఆ ఒకే ఒక్క ఛాన్స్ ఇపుడు ఆమె కెరీర్‌ను టర్న్ చేసిందన్న వార్త ఫిలింనగర్ సర్కిల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది
ఒక్క ఛాన్స్..ఒకే ఒక్క ఛాన్స్..ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టు ఉంది కదూ..ఖడ్గం మూవీలో సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న రవితేజ చెప్పే డైలాగ్ ఇది. ఇదే డైలాగ్ అప్లై చేసిందేమో తెలియదు కానీ..ఈ ఢిల్లీ బ్యూటీకి ఆ ఒక్క ఛాన్స్ వచ్చేసింది. ఆ ఒకే ఒక్క ఛాన్స్ ఇపుడు ఆమె కెరీర్‌ను టర్న్ చేసిందన్న వార్త ఫిలింనగర్ సర్కిల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇంతకీ ఎవరి గురించి చెబుతున్నది అనుకుంటున్నారా..?
అశోక వనంలో అర్జుణ కల్యాణం (Ashoka Vanamlo Arjuna Kalyanam)సెకండ్ ఫీ మేల్ లీడ్ పోషించిన రితికానాయక్ (Ritika Nayak) గురించి..అవును ఈ సినిమాలో ఎవరూ ఊహించిన విధంగా మెయిన్ హీరోయిన్ రుక్సార్ థిల్లాన్‌కు కూడా రాని స్పందన రితికా నాయక్ సీన్లకు వస్తుంటుంది. రితికా కనిపించిన ప్రతీసారి సిల్వర్ స్క్రీన్‌పై ఏదో మాయ చేస్తున్నదా..? అన్నట్టనిపిస్తుంది. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసి..అగ్ర నిర్మాతల దృష్టిని ఆకర్షించింది రితికానాయక్.
ఒకప్పుడు తొలి ప్రాజెక్టు హ్యాపీడేస్ సినిమా తర్వాత తమన్నాకు మూడు సినిమాల ఆఫర్ వచ్చినట్టుగానే రితికాకు కూడా అలాంటి జాక్‌పాట్ ఆఫరే వచ్చిందట. మెగా బ్యానర్ గీతాఆర్ట్స్ (Geetha Arts) నుంచి మూడు సినిమాల డీల్ (Three Film Deal ) కుదిరిందని చెప్పుకొచ్చింది రితికానాయక్. అంతేకాదు రెమ్యునరేషన్ కూడా పెద్ద మొత్తంలోనే ఇచ్చేందుకు గీతాఆర్ట్స్ రెడీ అయిందని టాక్.
గీతాఆర్ట్స్ లో ఇలాంటి డీల్ కుదిరిందంటే సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. మొత్తానికి ఒక్క సినిమా రితికా నాయక్ జీవితాన్ని మార్చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు సినీ జనాలు.
Read Also : SVP Pre Release Business | సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలిస్తే షాకే..!
Read Also : Shraddha Das | ‘చిట్టి నడుమునే చూస్తున్నా..చిత్రహింసలో చస్తున్నా’
Read Also : #Whatshappening | మహేశ్ ట్విటర్లో ఎవరిని ఫాలో అవ్వాలనుకుంటున్నాడంటే..వీడియో వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

