Ranveer Singh | ఈ పాట అంటే రన్ వీర్ సింగ్‌కు చాలా పిచ్చి అట..వీడియో వైరల్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సినీ పరిశ్రమలు ఒకటేనంటున్నాడు బాలీవుడ్ (Bollywood) హీరో రణ్ వీర్ సింగ్ (Ranveer Singh). తానెప్పుడూ భారతీయ సినిమా అనే అనుకుంటానని, అందుకు చాలా గర్వంగా ఉంటుందని అంటున్నాడు.
మిగతా హీరోల మాట ఎలా ఉన్నా..తనకు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సినీ పరిశ్రమలు ఒకటేనంటున్నాడు బాలీవుడ్ (Bollywood) హీరో రణ్ వీర్ సింగ్ (Ranveer Singh). తానెప్పుడూ భారతీయ సినిమా అనే అనుకుంటానని, అందుకు చాలా గర్వంగా ఉంటుందని అంటున్నాడు. ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణ్ వీర్ సింగ్ మాట్లాడిన మాటలు ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. తనకు బాగా నచ్చిన ఫేవరేట్ సాంగ్ ఏంటో చెప్పి అందరూ షాకయ్యేలా చేశాడు.
ఇంతకీ రన్వీర్ను బాగా ఇంప్రెస్ చేసిన పాటేంటో తెలుసా..? పుష్ప చిత్రంలోని ఊ అంటావా సాంగ్. దీని గురించి రన్ వీర్ సింగ్ మాట్లాడుతూ…నా ఫేవరేట్ పాట ఊ అంటావా (Oo Antava). ఈ పాట మ్యూజిక్ నన్ను చాలా టచ్ చేసింది. ఈ పాట వినడమంటే చాలా పిచ్చి..అది నన్ను ఏదో చేసేస్తుంది అని అన్నాడు రన్ వీర్ సింగ్. దక్షిణాది సినిమాలను ఎందుకు ప్రాంతీయ సినిమాగా పరిగణిస్తారు..? ఆ మాటకొస్తే హిందీ సినిమా కూడా ప్రాంతీయమే. భారతీయ వైవిధ్యాన్ని చూసి గర్విస్తానని అన్నాడు రన్ వీర్.
అంతేకాదు హిందీతోపాటు వివిధ భాషల్లో సినిమాలుచేయాలని ఉందని చెప్పాడు. ప్రస్తుతం జయేశ్‌భాయ్ జోర్దార్ (Jayeshbhai Jordaar) సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు రన్ వీర్ సింగ్. మే 13న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.
Bollywood star @RanveerOfficial
About #Ooantava song.👍#Pushpa @alluarjun #AlluArjun #Sukumar @ThisIsDSP @Samanthaprabhu2 #RanveerSingh #Pushpa #OoAntavaOoOoAntava pic.twitter.com/CDiEYhkOEo— Suresh PRO (@SureshPRO_) May 10, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

