ముంబై,జులై 2: ప్రముఖ వస్త్ర సంస్థ టీసీఎన్ఎస్ క్లాతింగ్ కో లిమిటెడ్ తమ ఎథ్నిక్ వేర్ బ్రాండ్ “ఔరెలియా” కోసం బాలీవుడ్ నటి అలియా భట్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకున్నది. ఫ్యాషన్ ఐకాన్ గా పేరున్న అలియా ఇప్పుడు భారతీయ ఎథ్నిక్ వేర్ బ్రాండ్ ఔరెలియా కు ప్రచారం చేయనున్నారు. ‘‘ఔరెలియా ఎల్లప్పుడూ సౌకర్యవంతమైన శైలిని ప్రోత్సహిస్తూనే, మహిళలు తమదైన అందానికి ప్రాతినిధ్యం ఎంచుకోవాల్సిందిగానూ ప్రోత్సహిస్తుంది.
” అలియా భట్‌తో ఒప్పందం చేసుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నదని” టీసీఎన్ఎస్ క్లాతింగ్ మేనేజింగ్ డైరెక్టర్ అనంత్ కుమార్ దాగా అన్నారు. మార్కెట్లో ఈ జనరేషన్ కూడా ఎథ్నిక్ వేర్ అవసరాలను “ఔరెలియా” తీరుస్తుంది. ఈ బ్రాండ్ ఆన్‌లైన్‌తో పాటుగా ఆఫ్‌లైన్‌లో కూడా 220కు పైగా ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ ఔట్లెట్లు ద్వారా “ఔరెలియా” ఉత్పత్తులు లభ్యం కానున్నాయి. ఇండియా, శ్రీలంక, నేపాల్, మారిషస్‌లలోని 150 కు పైగా నగరాల్లో వెయ్యికి పైగా స్టోర్లు ఉన్నాయి.