తేజస్, రోమి, దేవిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రాజా మార్కండేయ’. ‘వేట మొదలైంది’ ఉపశీర్షిక. బన్నీ అశ్వంత్ దర్శకుడు. సామా శ్రీధర్, పంజల వెంకట్ గౌడ్ నిర్మాతలు. ఇటీవల ఆడియోను విడుదల చేశారు. సత్యదీప్ సంగీతాన్నందించాడు.
ఈ కార్యక్రమానికి సీనియర్ హీరో సుమన్, ప్రతాని రామకృష్ణగౌడ్ అతిథులుగా హాజరయ్యారు. నేటి యుగంలో శివుడి భక్తుడైన మార్కండేయ జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? వాటిని శివుడి అనుగ్రహంతో ఎలా అధిగమించాడన్నదే చిత్ర కథాంశమని దర్శకుడు తెలిపారు.