Hi Nanna | టాలీవుడ్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి హాయ్ నాన్న (Hi Nanna). న్యాచురల్ స్టార్ నాని (Nani) కాంపౌండ్ నుంచి నాని 30 (Nani 30)గా వస్తోన్న ఈ చిత్రానికి శౌర్యువ్ (Shouryuv) (డెబ్యూ డైరెక్టర్) దర్శకత్వం వహిస్తున్నాడు. మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీని డిసెంబర్ 7న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.
రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది నాని అండ్ మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur)టీం. ఈ సందర్భంగా మృణాళ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ.. ఎమోషనల్ విజువల్ ట్రీట్‌గా సాగే అద్భుతమైన కథ అని చెప్పింది మృణాళ్ ఠాకూర్. సిల్వర్ స్క్రీన్‌పై విరాజ్, యశ్న ప్రయాణంతో ప్రేక్షకులు ప్రేమలో పడటం ఖాయమంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఇవాళ రాత్రి 7 గంటలకు అభిమానులతో కలిసి AskNani సెషన్లో పాల్గొనబోతున్నాడు నాని. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
ఇప్పటికే హాయ్ నాన్న నుంచి విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్, గ్లింప్స్ వీడియో, సాంగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ.. సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. హాయ్ నాన్న నుంచి లాంఛ్ చేసిన సమయమా సాంగ్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ.. మ్యూజిక్ లవర్స్‌ను ఫుల్ ఇంప్రెస్ చేస్తోంది. ఈ చిత్రానికి మలయాళం కంపోజర్, హృదయం ఫేం హేశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ తెరకెక్కిస్తున్నారు.
#AskNani at 7 PM today @NameIsNani #HiNanna pic.twitter.com/cN50MzrEVO
— Suresh PRO (@SureshPRO_) December 4, 2023
𝐇𝐢..
Walking into November with new energy ❤️
and the momentum is only going up from here for #HiNanna 🤩#HiNannaOnDec7th #HiPapa #HiPapaOnDec7thNatural 🌟 @NameIsNani @Mrunal0801 @shouryuv #BabyKiara @HeshamAWMusic @SJVarughese @artkolla @mohan8998 @drteegala9… pic.twitter.com/EwR6LQ2MDs
— Vyra Entertainments (@VyraEnts) November 1, 2023
హాయ్ నాన్న ప్రమోషన్స్..
You wouldn’t want to miss the sweet and candid talk between Natural 🌟 @NameIsNani and @Mrunal0801 🤗
Check out the promo and stay tuned for the Part 1 interview release tomorrow! ❤️🔥🤩#HiNanna Releasing Worldwide on DEC 7th, 2023 💥#HiNannaOnDec7th #HiPapaOnDec7th #HiPapa… pic.twitter.com/bYroMsGIyw— Vyra Entertainments (@VyraEnts) October 29, 2023
గాజు బొమ్మ ఫుల్ లిరికల్ సాంగ్..
సమయమా సాంగ్
హాయ్ నాన్న టైటిల్ గ్లింప్స్..
నాని 30 గ్లింప్స్ వీడియో..