Director Lakshman | రావు రమేష్ టైటిల్ రోల్ పోషించిన ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు లక్ష్మణ్ కార్య శనివారం పాత్రికేయులతో మాట్లాడుతూ ‘ఈ కథ చెప్పగానే రావుగారు రమేష్ నవ్వుతూ ఓకే చేశారు.
ఇక ఈ కథ విషయానికొస్తే ..ఓ రోజు నా భార్య అకౌంట్లో 80 వేలు క్రెడి ట్ అయ్యాయి. ఎవరు వేశారో తెలియదు. రెండు రోజుల తర్వాత ఫారిన్లో వున్న మా అత్తగారే డబ్బులేశారని తెలిసింది. ఆ రెండు రోజులు ఇంట్లో జరిగిన విషయాలన్నీ సరదాగా అనిపించాయి.
వాటి స్ఫూర్తితో ఈ కథ రాసుకున్నా. ఇందులో రావు రమేష్ మిడిల్ ఏజ్డ్ ఫాదర్‌గా కనిపిస్తారు’ అని తెలిపారు. ఈ సినిమాకు దర్శకులు సుకుమార్‌గారి భార్య తబిత సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నదని, ఈ సినిమా చూశాక సుకుమార్‌గారు ఫోన్ అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారని, ఆయన మాటలు తనలో కాన్ఫిడెన్స్‌ను పెంచాయని లక్ష్మణ్ కార్య ఆనందం వ్యక్తం చేశారు.