Balagam Movie | ‘బలగం’ సినిమా హవా ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. సినిమా వచ్చి నెల రోజులు అవుతున్నా ఇంకా ప్రేక్షకులు థియేటర్లకు బారులు తీస్తున్నారు. ఇలాంటి సినిమాలను థియేటర్లోనే ఎక్స్‌పీరియెన్స్ చేయాలనీ రిపీటెడ్ షోలు కూడా వేస్తున్నారు. ఇటీవలే ఓటీటీలో రిలీజైనప్పటికీ కూడా రోజుకు 50లక్షల కలెక్షన్లు వస్తున్నాయంటే ఈ సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. చిన్న సినిమాగా విడుదలైన బలగం బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. డిస్ట్రిబ్యూటర్లకు కళ్లు చెదిరే లాభాలు తెచ్చిపెడుతుంది. ఇక ఈ మధ్య పలు ఊర్లలో ఈ సినిమాను ఆరుబయట స్క్రీన్‌ను ఏర్పాటు చేసుకుని మరీ ప్రేక్షకులు ఈ సినిమాను వీక్షిస్తున్నారు.
కాగా తాజాగా ఓ ఊర్లో ఇలానే జనాలందరూ కలిసి స్క్రీన్‌ను ఏర్పాటుచేసుకుని సినిమాను వీక్షించారు. కాగా ఈ సినిమా క్లైమాక్స్ చూసి కంటతడి పెడుతున్నారు. ఆడవాళ్లు, మగవాళ్లు అని తేడా లేకుండా అందరూ ఎమోషనల్‌కు గురయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పల్లె అందాలను, తెలంగాణ సాంప్రదాయాలను, మనుషుల భావోద్వేగాలను వేణు కళ్లకు కట్టినట్లు చూపించాడు. దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే తిరుగులేని విజయం సాధించాడు. ఇక ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్‌తో పాటు ఈ సినిమాలో నటించిన వారందరూ ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు. భీమ్స్ పాటలు కూడా సినిమాకు బలం అయ్యాయి.
జనాల్లోకి బాహుబలి కన్నా ఎక్కువ సొచ్చుకు పోయింది బలగం ఇప్పట్లో ఆగేలా లేదు 😊@VenuYeldandi9 @priyadarshi_i @DilRajuProdctns #Balagam #Telangana pic.twitter.com/Sjt2uq5TJA
— Prash_Nani_Reddy (@_PrashuReddy) April 2, 2023