Mangli | మంగ్లీ కారుపై రాళ్ల దాడి.. షో నుంచి తిరిగొస్తుండగా ఘటన..!
బళ్లారి మున్సిపల్ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగిన బళ్లారి ఫెస్టివ్ కార్యక్రమంలో పాపులర్ సింగర్ పాల్గొన్నది. అయితే మంగ్లీ ఈవెంట్ ముగిసిన తర్వాత తిరిగి వెళ్లే క్రమంలో కొంతమంది వ్యక్తులు ఆమె వెళ్తున్న కారుపై దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.
Mangli | పాపులర్ సింగర్ మంగ్లీ (Mangli) వెళ్తున్న కారుపై రాళ్ల దాడి జరిగింది. బళ్లారి మున్సిపల్ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగిన బళ్లారి ఫెస్టివ్ కార్యక్రమంలో మంగ్లీ పాల్గొన్నది. మంగ్లీ ఈవెంట్ ముగిసిన తర్వాత తిరిగి వెళ్లే క్రమంలో కొంతమంది వ్యక్తులు ఆమె వెళ్తున్న కారుపై దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.
ఇటీవలే చిక్‌బళ్లాపూర్‌లోని జరిగిన ఓ ఈవెంట్‌కు మంగ్లీ హాజరైంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్టేజ్‌పైకి రావాలని.. అక్కడున్న యాంకర్ మంగ్లీని ఆహ్వానించింది. ఇక్కడ కన్నడవాళ్లున్నారు.. కన్నడలో మాట్లాడండి అని.. ఆ యాంకర్ మంగ్లీకి సూచించింది. అయితే పక్కన అనంతపురం ఉంది.. అందరికీ తెలుగు వస్తుందంటూ మంగ్లీ సమాధానమిచ్చింది.
యాంకర్ బలవంతం చేయడంతో ఒకటి రెండు మాటలు మాట్లాడే ప్రయత్నం చేసింది మంగ్లీ. యాంకర్ కన్నడలో ప్రశ్న అడిగేటపుడు తనకు అర్థం కావడం లేదని మంగ్లీ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగ్లీ కన్నడ ఇండస్ట్రీకి వచ్చి 2 సంవత్సరాలు దాటింది.. ఆమెకు కన్నడ అర్థం కాదు.. కానీ ఇక్కడికి వచ్చి కన్నడలో మాట్లాడేందుకు భయపడే ఆమెకు అవకాశం ఎందుకు ఇస్తారోనంటూ.. పలువురు నెటిజన్లు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మంగ్లీ కారుపై దాడి జరుగడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
కన్నడ స్టార్ హీరో దర్శన్ నటించిన రాబర్ట్ చిత్రంతో సింగర్‌గా శాండల్‌వుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది మంగ్లీ. పుష్ప.. ది రైజ్ సినిమాలోని ఊ అంటావా మావా కన్నడ వెర్షన్‌ను మంగ్లీనే పాడింది. మరి ఈ ఘటనపై మంగ్లీ ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.
Read Also :Mani Ratnam | కమల్ హాసన్ సినిమాకు మణిరత్నం భారీ స్కెచ్..
Read Also :Hunt | సుధీర్ బాబు హంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడో తెలుసా..?
Read Also : Butta Bomma | బుట్టబొమ్మ ఫైనల్ అప్డేట్.. గెట్ రెడ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

