Jugnuma Movie | బాలీవుడ్ నటులు అనురాగ్ కశ్యప్, జైదీప్ అహ్లావత్, విజయ్ వర్మ, వినీత్ సింగ్ వంటి సినీ ప్రముఖులు నటుడు మనోజ్ బాజ్‌పేయ్ కాళ్ళ మీద పడ్డారు. మనోజ్ బాజ్‌పేయ్ నటించిన చిత్రం ‘జుగ్నుమా’. ఈ సినిమా ప్రీమియర్‌ను ముంబైలో ప్రదర్శించగా.. ప్రీమియర్ అనంతరం దర్శకులు అనురాగ్‌తో పాటు జైదీప్ అహ్లావత్ తదితరులు ఒక్కసారిగా మనోజ్ కాళ్లపై ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే ఈ సన్నివేశం సరదాగా, గౌరవపూర్వకంగా జరిగిందని, ఇది వారి మధ్య ఉన్న మంచి అనుబంధాన్ని తెలియజేస్తుందని పలు వార్తా సంస్థలు నివేదించాయి. మనోజ్ బాజ్‌పేయ్, అనురాగ్ కశ్యప్ మధ్య చాలా కాలంగా మంచి స్నేహం ఉంది. వీరిద్దరి కలిసి ‘సత్య’, ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’ వంటి చిత్రాలలో కలిసి పనిచేశారు. అలాగే, ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’ చిత్రంలో జైదీప్ అహ్లావత్ కూడా కీలక పాత్ర పోషించారు.
A moment of pure respect & humour in equal parts! 😄
At the premiere of #Jugnuma, #AnuragKashyap, #JaideepAhlawat & #VijayVarma playfully line up to touch the feet of #ManojBajpayee.#FilmfareLens #Celebs pic.twitter.com/FcZhtVLwED
— Filmfare (@filmfare) September 11, 2025