Ntr-Prashant Neel Movie | ఎన్టీఆర్ ప్రస్తుతం ట్రిపుల్ఆర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ‘అరవింద సమేత’ తర్వాత దాదాపు నాలుగేళ్ళకు ‘ఆర్ఆర్ఆర్’తో ప్రేక్షకులను పలకరించాడు. మార్చి 25న విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తారక్ కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఈ చిత్రంలో తారక్ నటన వర్ణనాతీతం. ప్రస్తుతం తారక్ ఫ్యామిలీతో కలిసి హలీడేట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు. వెకేషన్ నుండి రాగానే కొరటాల శివతో సినిమాను ప్రారంభించనున్నాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. దీని తర్వాత తారక్, ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయనున్నాడు.
ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ప్రీ లుక్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. తారక్.. గుబురు గడ్డంతో కోపంతో రగిలిపోతున్నట్లు ఉన్న మాస్ పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రశాంత్‌నీల్ ప్రభాస్‌తో ‘సలార్’ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయిన తర్వాతే ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కనుంది. ఈ క్రమంలో చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ చిత్రానికి ‘అసుర’, ‘అసురుడు’ అనే రెండు టైటిల్స్‌ను పరిశీలనలో ఉంచినట్లు టాలీవుడ్ వర్గాల్లో సమాచారం. ఈ చిత్రంలో తారక్ పాత్రకు, స్టోరీ లైన్‌కు ఈ రెండు పేర్లు సరిపోతాయని చిత్రబృందం భావిస్తుందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.