Asin | టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అసిన్. తెలుగులో అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, గజిని, శివమణి, లక్ష్మీ నరసింహ, ఘర్షణ, చక్రం, దశావతారం తదితర చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ కేరళ కుట్టి.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటోంది.
తాజాగా అసిన్ కూతురు అరిన్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది. ఫొటోల్లో అరిన్ తన తండ్రి రాహుల్ శర్మకు మేకప్ వేస్తూ కనిపించింది. లిప్‌స్టిక్, ఐ షాడోస్, కాంపాక్ట్ వేసి అందరినీ ఆకట్టుకుంది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
2016 జనవరిలో తన బాయ్ ఫ్రెండ్, మైక్రోమేక్స్ సీఈఓ రాహుల్ శర్మను అసిన్ పెళ్లాడింది. 2017 అక్టోబర్‌లో వీరికి అరిన్ జన్మించింది. అప్పటి నుంచి తల్లితనాన్ని ఆస్వాదిస్తున్న అసిన్.. అప్పుడప్పుడు తన కూతురుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటోంది.