Ashwini Dutt | కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు టాలీవుడ్ అగ్ర నిర్మాత అశ్వనీదత్. వైజయంతి బ్యానర్లో వచ్చిన ఈ చిత్రం రూ.1150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్రభాస్ కథానాయకుడిగా వచ్చిన ఈ సినిమాను నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. అయితే ప్రస్తుతం కల్కి విజయంతో ఆనందంలో ఉన్న అశ్వనీదత్ తాజాగా తన మనసులోని మాటను బయటపెట్టాడు. తనకు రాజమౌళితో సినిమా చేయాలని ఉందని తెలిపాడు.
రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నం1 సినిమాకు నేనే సమర్పకుడిగా వ్యవహరించాను. జక్కన్నకు ఫస్ట్ సినిమానే అయినప్పటికి చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఇప్పుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. తనతో మళ్లీ ఓ సినిమా చేయాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. కాకపోతే అది కుదరడం లేదు. కానీ, నాకు మాత్రం ఇప్పటికి అతడితో సినిమా చేయాలని ఆశ మాత్రం అలానే ఉంది అంటూ అశ్వనీదత్ చెప్పుకోచ్చాడు.