Bigg Boss OTT Telugu | బిగ్‌బాస్ ఓటీటీ తెలుగు నాన్ స్టాప్ పేరుతో ప్రారంభం అయింది. డిస్నీ హాట్‌స్టార్‌లో బిగ్‌బాస్ నాన్ స్టాప్ పేరుతో 24 గంటలు ఈ షో ప్రసారం కానుంది. అయితే.. ఈసారి బిగ్ బాస్ ఓటీటీ ప్లాట్ఫామ్లో సరికొత్తగా ప్రారంభమైంది. ఇందులో ఇప్పటికే బిగ్ బాస్ 5 సీజన్లలో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్లు కూడా ఉండబోతున్నారు. వారియర్స్ వర్సెస్ చాలెంజర్స్ పేరుతో ఈసారి బిగ్‌బాస్ థీమ్‌ను సెట్ చేశారు.
వారియర్స్ అంటే ఇప్పటి వరకు జరిగిన 5 సీజన్లలో పార్టిసిపేట్ చేసిన కొందరు కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసి వాళ్లను మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌కు పంపిస్తున్నారన్నమాట. హోస్ట్ నాగార్జున తొలి వారియర్‌గా బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ అషు రెడ్డిని హౌస్‌లోకి పంపించాడు. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే ముందు నాగార్జునకు ఒక ముద్దు ఇచ్చి అషు.. బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లింది.