Ashoka Vanamlo Arjuna Kalyanam Release Date | వైవిధ్య భరిత కథలను ఎంచుకుంటూ నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా మంచి సక్సెస్‌ను సాధించిన యువ హీరో విశ్వక్ సేన్. ఎప్పటికప్పుడు కథల ఎంపికలో విభిన్నంగా ఆలోచిస్తూ సినీరంగంలో దూసుకుపోతున్నాడు. హీరోగా కెరీర్‌ను మొదలు పెట్టిన విశ్వక్ ‘ఫలక్‌నుమా దాస్’తో తన సినిమాకు తానే దర్శకుడిగా, నిర్మాతగా మారి సూపర్ సక్సెస్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం ఈయన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అంటూ విభిన్న కథతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు. ఈ చిత్రాన్నిమొదటి నుంచే విభిన్నంగా ప్రచారం చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదిను మేకర్స్ ప్రకటించారు.
ఈ చిత్రాన్ని ఏప్రిల్ 22న విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. కాగా ఈ చిత్రం మార్చి 4న విడుదల కానున్నట్లు గతంలోనే ప్రకటించారు. అల్లం అర్జున్ కమార్ జాతక రీత్యా మర్చి 4వ తేదీన పెండ్లి ముహూర్తం సరికాదని అంటూ విడుదల తేదీ వాయిదా వేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. ఈ చిత్రానికి విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహించాడు. బీవిఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్విసీసీ డిజటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. విశ్వక్‌కు జోడిగా రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా నటిస్తుంది.