సందీప్‌కిషన్, నేహాశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘గల్లీరౌడీ’. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 17న విడుదలకానుంది. ఆదివారం ఈ చిత్ర ట్రైలర్‌ను అగ్రహీరో చిరంజీవి విడుదలచేశారు. వినోదం, యాక్షన్ అంశాలతో ఆద్యంతం ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. రౌడీయిజం చేయడం ఇష్టంలేకపోయినా ప్రేమించిన అమ్మాయి కోసం రౌడీగా చెలామణి అవుతూ సందీప్‌కిషన్ కనిపిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘వారసత్వంగా రౌడీయిజాన్ని వృత్తిగా ఎంచుకున్న ఓ యువకుడి కథ ఇది. ఓ అమ్మాయి కారణంగా ఆ రౌడీ జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేది నవ్విస్తూనే ఉత్కంఠను పంచుతుంది. రాజేంద్రప్రసాద్, బాబీసింహ నటన ఆకట్టుకుంటుంది’ అని తెలిపారు. పోసాని కృష్ణమురళి, వెన్నెలకిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చౌరస్తా రామ్, సాయికార్తిక్, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్.