AP News | మల్లాం బ్రహ్మోత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. వేడి సాంబారు మీద పడటంతో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాకర సంఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా చిట్టమూరు మండలంలోని మల్లాం బ్రహ్మోత్సవాల్లో జరిగింది. ఉత్సవాల్లో భాగంగా అన్నదానం కోసం వంటకాలు సిద్ధం చేశారు.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వేడి సాంబారు మీద పడటంతో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.