Satya | టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు సత్య మృతి చెందాడు. గురువారం సాయంత్రం ఆకస్మికంగా గుండెపోటు రావడంతో.. కుటుంబ సభ్యులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగానే సత్య తుది శ్వాస విడిచాడు. ఈయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
క్యారెక్టర్ ఆర్టీస్టుగా సినీ కెరీర్‌ను ప్రారంభించిన సత్య ‘వరం’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ‘బ్యాచ్‌లర్’ అనే సినిమాలో నటించాడు. ఈ రెండు చిత్రాలు ఫ్లాప్ అవడంతో ఈయనకు టాలీవుడ్లో తగిన గుర్తింపు రాలేదు. దాంతో సినిమాలకు స్వస్తి చెప్పి, బిజినెస్‌లపై దృష్టి పెట్టాడు. అంతా బాగానే జరుగుతున్న సమయంలో గతేడాది సత్య భార్య, తల్లి ఇద్దరు చనిపోయారు. దాంతో సత్య మానసిక క్షోభకు గురైయ్యాడు. ఈయనకు ఎనిమిదేళ్ళ కుమార్తె ఉంది.