Article 370 | ‘ఆర్టికల్ 370’ సినిమాపై బ్యాన్ విధించిన అరబ్ దేశాలు.. కారణమిదే!
Article 370 | బాలీవుడ్ నటి యామి గౌతమ్ (Yami Gautham), ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఆర్టికల్ 370’ (Article 370). ఈ సినిమాకు రెండుసార్లు జాతీయ అవార్డు గ్రహీత ఆదిత్య సుహాస్ జంభలే (Aditya Suhas Jambhale) దర్శకత్వం వహించగా.. జియో స్టూడియోస్, A B62 స్టూడియోస్ బ్యానర్లపై ఉరి: ది సర్జికల్ స్ట్రైక్(Uri : The Surgical Strike) ఫేమ్ ఆదిత్య ధర్ నిర్మించాడు.
Article 370 | బాలీవుడ్ నటి యామి గౌతమ్ (Yami Gautham), ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఆర్టికల్ 370’ (Article 370). ఈ సినిమాకు రెండుసార్లు జాతీయ అవార్డు గ్రహీత ఆదిత్య సుహాస్ జంభలే (Aditya Suhas Jambhale) దర్శకత్వం వహించగా.. జియో స్టూడియోస్, A B62 స్టూడియోస్ బ్యానర్లపై ఉరి: ది సర్జికల్ స్ట్రైక్(Uri : The Surgical Strike) ఫేమ్ ఆదిత్య ధర్ నిర్మించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్‌తో పాటు నెగిటివ్ రివ్యూస్ వస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాపై అరబ్ దేశాలు బ్యాన్ విధించాయి. ఈ సినిమా ఒక వర్గాన్ని మాత్రమే అణచివేతకు గురయినట్లు మరో వర్గం మొత్తం విలన్స్ అన్నట్లు చూపించారని అందుకే ఈ సినిమాను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించాయి. మరోవైపు ఈ సినిమా విడుదల కాకముందే ప్రధాని మోడీ కొన్ని విషయాల గురించి సరైన సమాచారం తెలుసుకోవాలంటే ‘ఆర్టికల్ 370’ లాంటి చిత్రాలను చూడాలని ప్రకటించాడు. దీంతో ఈ మూవీ చూసిన నెటిజన్లు కొందరు ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు ఇది ఒక బీజేపీ ప్రాపగండ మూవీ అని.. కామెంట్స్ చేస్తున్నారు. కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ, రజాకర్ ఫైల్స్ ‘ఆర్టికల్ 370’ ఇలా బీజేపీ ప్రాపగండ మూవీలన్నింటిని ఒక్కొక్కటిగా వదులుతుందని నెటిజన్లు తెలుపుతున్నారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 2019 ఫిబ్రవరి 14న పుల్వామా దాడి జరిగిన అనంతరం జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir)కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసే అంశం తెరపైకి వస్తుంది. అయితే ఆర్టికల్ 370ను రద్దు చేసే క్రమంలో కశ్మీర్లో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి అనే ఆధారంగా ఈ సినిమా వచ్చింది. ఇక ఈ సినిమాలో యామి గౌతమ్ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా కనిపించనుండగా.. ప్రియమణి కీలక పాత్ర పోషించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
KTR | భారత రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదు.. జ్ఞానేష్ కుమార్ తక్షణమే వైదొలగాలి: కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

