Article 370 | ఆర్టికల్ 370 రద్దుపై ‘సుప్రీం’ తీర్పు..! బాలీవుడ్ ప్రముఖుల స్పందన ఇదీ..!
Article 370 | ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు సోమవారం తీర్పున వెలువరించింది. జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదా (ఆర్టికల్ 370)ను రద్దు చేస్తూ రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులు ఇచ్చిన చెల్లుబాటవుతాయని స్పష్టం చేసింది. తాము జోక్యం చేసుకోలేమని వెల్లడించింది.
Article 370 | ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు సోమవారం తీర్పున వెలువరించింది. జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదా (ఆర్టికల్ 370)ను రద్దు చేస్తూ రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులు ఇచ్చిన చెల్లుబాటవుతాయని స్పష్టం చేసింది. తాము జోక్యం చేసుకోలేమని వెల్లడించింది. సుప్రీంతీర్పు నేపథ్యంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై నటుడు అనుపమ్ ఖేర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన వీడియోను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేయాల్సిన అవసరం ఉందని.. కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమన్నారు.
ఇకపై దానికి సంబంధించిన చర్చలన్నీ ముగిసిపోతాయని నమ్ముతున్నానన్నారు. మరో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సైతం స్పందించారు. ఆర్టికల్ 370ని రద్దు చేసినందుకు నరేంద్ర మోదీ, అమిత్ షాలకు అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దును సమర్థించినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఆర్టికల్ 370లోని నిబంధనలను రద్దు చేస్తూ 2019 ఆగస్టు 5న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపు సర్వోన్నత న్యాయస్థానం సుదీర్ఘంగా విచారించి.. సోమవారం తీర్పును వెలువరించింది. సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ పిటిషన్లపై తీర్పును ఇచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burns crop | నీళ్లు లేక కరెంట్ రాక..సూర్యాపేట జిల్లాలో పంటను కాలబెట్టిన కౌలు రైతు
AP News | తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం.. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు..!
Ishan Kishan | ఇషాన్ కిషన్ కోలుకుంటున్నాడు.. అయినా మూడో టీ20కి దూరం.. బీసీసీఐ కీలక ప్రకటన!
Gulam Nabi Azad | భారత్‌తోపాటు కశ్మీర్ ప్రజలకూ పాకిస్థాన్ శత్రువే : గులాం నబీ ఆజాద్
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

