Ram Gopal Varma | ‘రామాయణం 2’ కలెక్షన్లు పార్ట్1 కంటే పదింతలు ఎక్కువ ఉంటాయి: రామ్ గోపాల్ వర్మ
Ram Gopal Varma | రామాయణం సినిమాపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. రూ. 1,200 కోట్ల వసూళ్ల మైలురాయిని దాటిన ఈ సినిమాకు సంబంధించి నిర్మాత నమిత్ మల్హోత్రా ఆర్థిక వ్యూహాన్ని వర్మ సమర్థించారు.
Ram Gopal Varma | రామాయణం సినిమాపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. రూ. 1,200 కోట్ల వసూళ్ల మైలురాయిని దాటిన ఈ సినిమాకు సంబంధించి నిర్మాత నమిత్ మల్హోత్రా ఆర్థిక వ్యూహాన్ని వర్మ సమర్థించారు. అంతేకాకుండా, ఈ చిత్రానికి రాబోయే సీక్వెల్ (‘రామాయణం పార్ట్ 2’) మొదటి భాగం కంటే పదింతలు ఎక్కువ వసూలు చేస్తుందని ఆయన సంచలన జోస్యం చెప్పారు.
ఈ సినిమాను తాను రెండుసార్లు చూశానని, ఇది భారతీయ సిని చరిత్రలోనే అతిపెద్ద హిట్‌గా నిలుస్తుందని వర్మ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కొందరు ఈ చిత్ర బడ్జెట్ సుమారు రూ. 2,000 కోట్లు ఉంటుందని విమర్శిస్తున్నారని, అయితే మొదటి భాగం అసలు ఖర్చు రూ. 800 కోట్ల లోపే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్లు వంటి వాటి కోసం చేసిన ఖర్చు భవిష్యత్తులో సీక్వెల్‌కు, గేమింగ్ మరియు ఇతర వెంచర్లకు ప్రధాన ఆస్తులుగా మారుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
తొలి భాగం సాధిస్తున్న భారీ వసూళ్లతో నిర్మాత నమిత్ మల్హోత్రా రెండు భాగాల ఖర్చును మొదటి భాగంతోనే రికవరీ చేస్తారని వర్మ జోస్యం చెప్పారు. కెజీఎఫ్‌తో పోలిస్తే కెజీఎఫ్2 ఏ విధంగా ఐదింతలు ఎక్కువ వసూలు చేసిందో, అలాగే రామాయణం పార్ట్ 1తో పోలిస్తే రామాయణం పార్ట్ 2 పదింతలు ఎక్కువ వసూలు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాముడి వారసత్వ యుద్ధం, లంకా దహనం, హనుమంతుని విన్యాసాలు, రావణ వధ వంటి భారీ యాక్షన్ సన్నివేశాలతో రెండవ భాగం మరింత అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నారు. నితీశ్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం రెండో భాగం 2028 దీపావళికి విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ram Gopal Varma | ‘రామాయణం 2’ కలెక్షన్లు పార్ట్1 కంటే పదింతలు ఎక్కువ ఉంటాయి: రామ్ గోపాల్ వర్మ
IND vs NZ | నిలకడగా ఆడుతున్న కివీస్.. 20 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే..!
Health tips | విటమిన్ B12 లోపాన్ని లైట్ తీసుకుంటున్నారా.. గుండెకు, లివర్‌కు ప్రమాదమట తెలుసా..?
KCR | కేసీఆర్‌తో ఆదిలాబాద్ యువనేత భార్గవ్ దేశ్‌పాండే భేటీ
Delhi Air Pollution | ఢిల్లీలో పెరుగుతున్న ఎయిర్ పొల్యూషన్.. 325కి పడిపోయిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్..!
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

